Site icon NTV Telugu

Putin safe in Alaska: అలస్కాకు పుతిన్.. అక్కడ ఆయన సేఫేనా?

06

06

Putin safe in Alaska: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు దేశాలకు అధినేతలు వాళ్లిద్దరూ. అలాంది వాళ్లు ఒక చోట కలుస్తున్నారంటే అక్కడ ఎన్ని భద్రతలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారిద్దరిలో ఒకరు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాగా, మరోకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ ఇరువురు దేశాధినేతలు ఈనెల 15న అమెరికాలోని అలాస్కాలో భేటీ కానున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం రష్యా అధ్యక్షుడిపై వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఈ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

READ MORE: Asaduddin Owaisi: భారత్‌పై పాక్ ప్రధాని ఫైర్.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అదిరిపోయే రిప్లై..!

అలాస్కాలోనే ఎందుకు..
అలాస్కా ఒకప్పుడు రష్యాలో భాగంగా ఉండేది. దానిని రష్యన్ జార్ అమెరికాకు అమ్మేశాడు. అంతర్జాతీయ న్యాయస్థానం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై వారెంట్ జారీ చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయాన్ని అమెరికా పాటించాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే కాకుండా పుతిన్ ఓడ మరే ఇతర దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించకుండానే అలాస్కాకు సులభంగా వెళుతుంది. అయితే మరే ఇతర దేశంలోనైనా సమావేశం కావాలంటే, అంతర్జాతీయ కోర్టు నిర్ణయాన్ని అంగీకరించే దేశాల గుండా ఓడ ప్రయాణించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పుతిన్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రష్యా అధ్యక్షుడు పుతిన్ – యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అలాస్కాలో సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు.

నో-ఫ్లై జోన్‌…
అలాస్కాలో వ్లాదిమిర్ పుతిన్ భద్రత ఎలా ఉంటుంది అనే వివరాలు వెల్లడయ్యాయి. వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం అమెరికాలోని అలాస్కాకు చేరుకుని డోనాల్డ్ ట్రం‌ప్‌ను కలుస్తారు. పుతిన్ – ట్రంప్ ఎల్మెండోర్ఫ్-రిచర్డ్‌సన్ సైనిక స్థావరంలో సమావేశమవుతారు. భద్రతా కోణం నుంచి ఈ సైనిక స్థావరం చాలా సురక్షితమైనదిగా పేర్కొంటున్నారు.

పుతిన్ బేరింగ్ జలసంధి ద్వారా అలాస్కాకు వెళతారు. ఆయన రష్యన్ గగనతలం నుంచి నేరుగా అమెరికా గగనతలంలోకి ప్రవేశిస్తారు. పుతిన్ రాక నేపథ్యంలో ఆగస్టు 15న అలాస్కాలోని యాంకరేజ్‌లో అన్ని విమానాలను నిషేధించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించారు. పుతిన్ విమానానికి ప్రత్యేక భద్రతా ప్రోటోకాల్ ఉంటుంది. సీక్రెట్ సర్వీస్ విమానంలోని ప్రతి అంగుళాన్ని నిఘా ఉంచుతుంది. పుతిన్ వచ్చే రోజు ఆయన భద్రత సీక్రెట్ సర్వీస్ చేతుల్లో ఉంటుంది. రష్యా అధ్యక్షుడిని సురక్షితంగా విమానాశ్రయానికి, తిరిగి తీసుకురావడానికి క్రెమ్లిన్ భద్రతా సిబ్బంది ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ సమావేశంలో కాల్పుల విరమణ, భవిష్యత్తు వ్యూహాన్ని చర్చించనున్నట్లు సమాచారం.

READ MORE: India Stops Buying Russian Oil: రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తే.. ఇండియా పరిస్థితి ఏంటి..?

Exit mobile version