Site icon NTV Telugu

Putin: రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం.. త్రివిధ దళాలు గౌరవ వందనం

Putin2

Putin2

రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘనస్వాగతం లభించింది. పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అటు తర్వాత ఇరు దేశాలకు సంబంధించిన అధికారులు పరిచయం చేసుకున్నారు.

హైదరాబాద్‌ హౌస్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ పాల్గొంటారు. అనంతరం రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించనున్నారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత రష్యా ప్రభుత్వ ఛానల్‌ను భారత్‌లో పుతిన్ ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించనున్నారు. తిరిగి రాత్రి 9 గంటలకు రష్యాకు బయల్దేరి వెళ్లిపోతారు.

ఒప్పందాలు ఇవే..
ఇక ఈ రోజు జరిగే ద్వైపాక్షిక సంబంధాల్లో 2 బిలియన్ డాలర్ల జలాంతర్గాముల లీజు ఒప్పందంపై కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ముడి చమురు దిగుమతులపై కూడా చర్చకు వచ్చే ఛాన్సుంది. అలాగే రష్యాలో భారతీయ కార్మికులకు ఉద్యోగావకాశాలపై ఒప్పందం జరగనుంది. అలాగే భారత్ నుంచి రష్యాకు ఫార్మా, వ్యవసాయ, ఆహార, వినియోగ వస్తువుల ఎగుమతులపై ఒప్పందం జరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. నేటి బంగారం ధరలు ఇలా..!

Exit mobile version