Site icon NTV Telugu

Hyderabad: బాలానగర్ విమల్ థియేటర్లో పుష్ప 2 టికెట్ల రగడ.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్

Pushpa 2

Pushpa 2

Hyderabad: బాలానగర్ విమల్ థియేటర్‌లో పుష్ప 2 టికెట్ల రగడ కొనసాగుతోంది. పుష్ప 2 రిలీజ్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా విమల్ థియేటర్‌లో పుష్ప 2 సినిమా వేశారు. ఈ నేపథ్యంలో పలువురు అభిమానులకు టికెట్స్ అందలేదు దీంతో ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురయ్యారు. టికెట్స్ లేకపోవడంతో ఆగ్రహంతో రెండు వర్గాలకు చెందిన ఫ్యాన్స్ పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు.. ‘పుష్ప 2’ విడుదలై నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘పుష్ప మా జీవితంలో ఐదేళ్లపాటు సాగిన మరువలేని ప్రయాణంగా నిలిచింది. ఈ మూవీపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం మాలో మరింత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఒక అద్భుతంగా మార్చిన ప్రతిఒక్కరికీ మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాం. ఇంత గొప్ప టీంతో పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం’ అని అన్నాడు.

Exit mobile version