NTV Telugu Site icon

Pushpa 2 : ఆ రికార్డులు పుష్ప 2కే సొంతం

Pushpa2 (5)

Pushpa2 (5)

Pushpa 2 : అల్లు అర్జున్‌ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా పుష్ప 2. డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్‌ 4 రాత్రి 9.30కి ప్రీమియర్‌ షోలు పడబోతున్నాయి. అలాగే డిసెంబర్‌ 4నే అమెరికాతో పాటు పలు దేశాల్లో స్క్రీనింగ్‌ మొదలు కాబోతుంది. అటే నార్తిండియాలో మాత్రం ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల హిందీ పుష్ప 2 కోసం అడ్వాన్స్ బుకింగ్‌ స్టార్ట్ అయ్యాయి. పుష్ప 2 సినిమాకు హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి ఎలా ఉంది అనేది ఇప్పటికే నమోదు అయిన అడ్వాన్స్ బుకింగ్‌తో స్పష్టం అయింది.

పుష్ప 2 సినిమా హిందీ వర్షన్‌ అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు అయిన కొన్ని నిమిషాల్లోనే బుక్‌ మై షో ద్వారా పది వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. ఆన్‌ లైన్ ద్వారా మాత్రమే కాకుండా ఆఫ్‌ లైన్‌ ద్వారా థియేటర్ల వద్దకు వెళ్లి క్యూలో నిలబడి మరీ పుష్ప 2 టికెట్లను హిందీ ప్రేక్షకులు తీసుకున్నారు. 24 గంటలు పూర్తి కాకుండానే రికార్డ్‌ స్థాయిలో పుష్ప 2 హిందీ టికెట్లు అమ్ముడు పోయాయని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌ చెబుతున్నారు. బాహుబలి 2, కేజీఎఫ్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌ను దాటి మరీ పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్‌ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Read Also:Health Tips: రోజూ ‘మెంతి టీ’ని తాగండి.. ఆ సమస్యలకు చెక్ పెట్టండి..!

రికార్డు స్థాయిలో పుష్ప 2కి ఓపెనింగ్స్ దక్కాలని అంటే కచ్చితంగా సినిమా ఉత్తరాదిన భారీగా కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాకు అడ్వాన్సుల కిందనే ఇప్పటి వరకు దాదాపు 40కోట్లకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క హిందీ నుంచే దాదాపు రూ.10కోట్లకు పైగా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కింద వచ్చాయి. ఓవరాల్ ఇండియా వ్యాప్తంగా ఫస్ట్ రోజు 11వేలకు పైగా షోలు పడనున్నాయి. దీనిని బట్టి చూస్తే అనుకున్నట్లుగానే భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్‌ జరుగుతోంది. అనుకున్న దాని కంటే ఎక్కువగానే మొదటి రోజు వసూళ్లు ఉంటాయంటూ నిర్మాతలకు నమ్మకం కలిగించే విధంగా నార్త్‌ ఇండియాతో పాటు సౌత్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్‌ నమోదు అవుతున్నాయి.

మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప 2 సినిమా రికార్డులను నెలకొల్పాలి అంటే కచ్చితంగా నార్త్ ప్రేక్షకుల ప్రోత్సాహం చాలా ముఖ్యం. పుష్ప 2 మొదటి రోజు వసూళ్ల రికార్డు కొన్నేళ్ల పాటు కొనసాగే ఛాన్సులు ఉన్నాయి. బాలీవుడ్‌లో ఏ సినిమాకు దక్కని ఓపెనింగ్స్ పుష్ప 2 కి దక్కడంతో పాటు కేవలం హిందీ మార్కెట్‌లోనే సినిమా లాంగ్‌ రన్‌ లో రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలను కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు, బాక్సాఫీస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read Also:Harshit Rana: చెలరేగిన హర్షిత్.. 6 బంతుల్లో 4 వికెట్లు