NTV Telugu Site icon

Pushpa 2 : తెలుగు స్టేట్స్ సింగిల్ స్క్రీన్ లో పుష్ప రాజ్ హిస్టరీ

Pushpa 2

Pushpa 2

Pushpa 2 : ఇండియన్ బాక్సాఫీస్ దమ్ము దులిపేశాడు పుష్పరాజ్. డెడ్లీ కాంబో సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాతో మాస్ తాండవం చూపించారు. 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయినా ఈ సినిమా ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు రూ. 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. ఇందులో ఒక్క హిందీలోనే రూ. 800 కోట్లు వచ్చాయి. ఇక త్వరలోనే చైనాలో పుష్ప2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడితో ఇండియన్ నెంబర్ 1 మూవీ ఉన్న దంగల్ రికార్డ్ బ్రేక్ కానుంది.

అయితే ఇప్పటికే ఈ సినిమాను థియేటర్లో చూసేసినప్పటికీ, రీసెంట్‌గా రీ లోడెడ్ వెర్షన్ అంటూ 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేసి రిలీజ్ చేశారు మేకర్స్. సుకుమార్ యాడ్ చేసిన సీన్స్ మాత్రం సినిమాకే హైలెట్‌గా ఉన్నాయంటూ చూసిన వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 ఓటీటీ డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు పుష్పరాజ్ అభిమానులు. థియేటర్లో సినిమా రిలీజ్ అయిన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. జనవరి 29న లేదా 31న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది.

Read Also:Mountains: భూమి అడుగున మౌంట్ ఎవరెస్ట్ కన్నా రెండు ఎత్తైన పర్వతాలు.. ఎక్కడంటే..!

ఈ సినిమా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం ఇండియా వైడ్ గా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇపుడు ఒక చారిత్రాత్మక రికార్డుని తెలుగు రాష్ట్రాల్లో నమోదు చేసినట్లుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మన తెలుగు స్టేట్స్ లో చాలా సింగిల్ స్క్రీన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలా పలు సింగిల్ స్క్రీన్ లో ఇన్నేళ్ల కాలంలో చాలా సినిమాల పేరిట భారీ రికార్డులు నమోదయ్యాయి. ఇలా ప్రస్తుతం పుష్ప 2 తెలంగాణ హైదరాబాద్ లో సంధ్య 70ఎంఎం స్క్రీన్ లో ఆల్ టైం రికార్డు గ్రాస్ ని అందుకున్నట్లుగా తెలిపారు మేకర్స్.

ఇక్కడ ఏకంగా కోటి 89 లక్షల 75 వేల 880 రూపాయల గ్రాస్ ని ఈ 51 రోజుల్లో అందుకుందని మేకర్స్ తెలిపారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ సింగిల్ స్క్రీన్ కి లేని హైయెస్ట్ వసూళ్లు ఈ చిత్రానికి నమోదు అయ్యాయి. మరి పుష్ప 2 ని ఈ ఒక్క స్క్రీన్ లోనే 206 షోస్ కి గాను ఒక లక్ష 4 వేల 580 మంది చూశారట. దీనితో పుష్ప 2 ఖాతాలో ఈ హిస్టారికల్ రికార్డు అనే చెప్పాలి.

Read Also:ICC T20: ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024 కెప్టెన్‌గా ‘హిట్ మ్యాన్’..