NTV Telugu Site icon

Pushpa 2 : నేటి నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తున్న పుష్ప 2 టీజర్..!!

Whatsapp Image 2024 04 16 At 7.48.33 Am

Whatsapp Image 2024 04 16 At 7.48.33 Am

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎంతటీ ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఈ చిత్రంతోనే అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడుగా జాతీయ చలన చిత్ర అవార్డ్ లభించింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీగా కలెక్షన్స్ రాబట్టింది.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా “పుష్ప 2: ది రూల్ ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..పుష్ప-2 ది రూల్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న్నారు. పుష్ప పార్ట్ 1లోఅల్లు అర్జున్ నటనకు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయారు.ఇక ప్రస్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ వచ్చిన సెన్పేషన్‌ అవుతుంది.. ఇటీవల ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ టీజర్ విడుదలైనప్పటి నుండి ఊహించని స్పందనతో వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అంతేకాదు టీజర్ విడుదలైనప్పటి నుండి యూట్యూబ్‌లో కంటిన్యూగా 138 గంటలపాటు ట్రెండింగ్‌లో నెంబర్‌వన్‌గా వుంటూ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది . అంతేకాదు ఇప్పటి వరకు 110 మిలియన్ల వ్యూస్‌తో పాటు, 1.55మిలియన్ల లైక్స్‌తో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది…పుష్ప 2 మూవీ . 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.. ఇదిలా ఉంటే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న పుష్ప 2 టీజర్ ను నేటి నుంచి థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు.. ఈ న్యూస్ తెలిసిన పుష్ప ప్రేక్షకులు ఎంతో ఖుషి అవుతున్నారు.