ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు ఈ సినిమా కొనసాగింపు గా వస్తుంది.దీనితో “పుష్ప 2 ” మూవీపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే ఇటీవలే మేకర్స్ పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ “పుష్ప పుష్ప” సాంగ్ ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతోపాటు బెంగాళీ భాషల్లో విడుదల చేసారు.ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.ఇప్పటికే ఈ సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ దూసుకుపోతుంది. మొదటి సాంగే చార్ట్ బస్టర్ గా నిలవగా ఈ సినిమాలో రెండో పాట ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి రెండో పాటగా ఓ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.అల్లు అర్జున్, రష్మిక మందన్నాపై వచ్చే ఈ రొమాంటిక్ సాంగ్ ను ఎంతో గ్రాండ్ గా విడుదల చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.