Site icon NTV Telugu

Pushpa 2 : మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్..?

Pushpa2

Pushpa2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నలేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’.ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు .టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట సిద్ధం అయింది. ‘పుష్ప.. పుష్ప’ అంటూ ఈ పాట ప్రోమో కూడా ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసారు. అయితే, ఈ ఫుల్ సాంగ్ కంటే ముందే ఓ సర్‌ప్రైజ్ ఇస్తామని చిత్ర యూనిట్ తెలిపింది .’పుష్ప..పుష్ప’ అనే తొలి పాట మే 1వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రోమో సోషల్ మీడియాలో అదరగొడుతుంది. ప్రోమోకే ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తే ఫుల్ సాంగ్ కనుక రిలీజ్ అయితే ఏ రేంజ్‍లో హిట్ అవుతుందా అనే అంచనాలు మొదలు అయ్యాయి.

 

అయితే ఫుల్ సాంగ్ కంటే ముందే ఓ సెన్సేషనల్ సర్‌ప్రైజ్ తెస్తామని మూవీ టీమ్ ప్రకటించడంతో ఏమై వుంటుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .పుష్ప.. పుష్ప పాటకు సంబంధించి రెండో ప్రోమోను కూడా పుష్ప 2 మూవీ టీమ్ తీసుకురానుందని సమాచారం.మరో మూడు రోజుల్లో ఈ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుందని సమాచారం. అయితే రెండో ప్రోమోకు సంబంధించి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రోమోలో అల్లు అర్జున్ సిగ్నేచర్ తగ్గేదెలే మూవ్ ఉంటుందని సమాచారం.పుష్ప సినిమాతో రికార్డు కలెక్షన్స్ సాధించిన ఐకాన్ స్టార్ పుష్ప 2 మూవీ తో ఈ సారి బాక్స్ ఆఫీస్ ఫై దండయాత్ర చేయడం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు .

Exit mobile version