ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప2″.పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.అలాగే ఆ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.అంతేకాదు పుష్ప సినిమాలో తన నటనకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా దక్కంది. దీనితో తరువాత రాబోయే పుష్ప 2 సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా పుష్ప 2 షూటింగ్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అల్లు అర్జున్ రేంజ్ దృష్టిలో ఉంచుకొని భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఎంతో గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారని సమాచారం.ఈ క్రమంలో తాజాగా పుష్ప 2 సెట్స్ నుంచి ఓ వీడియో లీకైంది. సెట్స్ లో వందలకొద్ది లారీలను వరుస క్రమంలో పార్క్ చేసి అయితే ఉంచారు. పుష్ప పార్ట్ వన్ లో లారీలతో చేసిన స్టంట్స్ ఎంత హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. థియేటర్లలో ఆ సీన్స్ కి ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేసారు..
ఈ క్రమంలోనే మళ్లీ లారీలతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.. ఈ లారీలను చూస్తూ ఉంటే దర్శకుడు సుకుమార్ ఏదో పెద్ద మొత్తంలోనే ప్లాన్ చేసినట్లు అర్థం అవుతోంది. ఇన్నీ లారీలతో ఒక బిగ్గెస్ట్ యాక్షన్ సీన్స్ పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేసింది చిత్ర యూనిట్. దీనితో మరో భారీ యాక్షన్ సీన్ కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇలా సినిమా నుంచి వస్తున్న లీక్డ్ అప్డేట్స్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న ఈ చిత్రం అదే స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా మేకర్స్ భారీగానే నిర్వహించనున్నారని సమాచారం.గతంలో పుష్ప 2 నుంచి వచ్చిన గ్లింప్స్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది.. ఈ చిత్రానికి దేవిశ్రీ మరోసారి అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్లు సమాచారం.మరి పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.