Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూరీ జగన్నాథ ఆలయ యాజమాన్య సంస్థ ఆలయ బ్యాంకు బ్యాలెన్స్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించింది. అయోధ్య రామ్ మందిర విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. పారదర్శకతను చాటుకునేందుకు జగన్నాథుని పేరిట బ్యాంకుల్లో రూ. 1,912 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు ప్రకటించింది. ఆలయ నిధుల నిర్వహణ అత్యున్నత పారదర్శకతతో, క్రమబద్ధమైన ఆడిటింగ్, అకౌంటింగ్ పద్ధతుల ద్వారా జరుగుతోందని ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరవింద కుమార్ పఢీ స్పష్టం చేశారు. భక్తుల నమ్మకాన్ని కాపాడేందుకు స్పష్టమైన జవాబుదారీతనం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఆలయానికి వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలు, ఆలయానికి చెందిన గనులు, క్వారీల ద్వారా వచ్చే ఆదాయం, ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ, భూముల లావాదేవీల ద్వారా లభించే ఆదాయంతో పాటు ప్రభుత్వ గ్రాంట్లు ప్రధాన వనరులుగా ఉన్నాయి. ఈ ఆదాయంలో కొంత భాగాన్ని కార్పస్ ఫండ్, ఫౌండేషన్ ఫండ్, టెంపుల్ ఫండ్ అనే మూడు విభాగాలలో ఫిక్స్డ్ డిపాజిట్లుగా జమ చేస్తారు. ఈ నిధుల నుంచి వచ్చే వడ్డీని ఆలయంలో రోజువారీ పూజలు, సాంప్రదాయక సేవలు మరియు పరిపాలనా వ్యయాల కోసం ఉపయోగిస్తారు.
Also Read
- 165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
- Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
- Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
ఆగస్టు 31, 2026 నాటికి ఎస్జేటీఏ వద్ద దాదాపు రూ. 1,912 కోట్ల విలువైన బ్యాంకు ఆస్తులు ఉన్నాయి. ఇందులో కార్పస్, ఫౌండేషన్, టెంపుల్ డిపాజిట్ల రూపంలో సుమారు రూ. 1,811 కోట్లు ఉండగా, మిగిలిన రూ. 100 కోట్లకు పైగా నిధులు సేవింగ్స్, కరెంట్ మరియు ఫ్లెక్సీ ఖాతాల్లో ఉన్నాయి. జూన్ 2024లో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ. 500 కోట్ల కార్పస్ ఫండ్ కూడా ఇందులో భాగమే. ఆలయ హుండీలో లభించే కానుకలను ప్రతిరోజూ లెక్కించి, ఆ వివరాలను డిజిటల్ బోర్డులలో, అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. జూలై 15న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రారంభించిన ‘సమర్పణ్’ డిజిటల్ హుండీ ద్వారా ఇప్పటివరకు భక్తులు రూ. 56.7 లక్షల విరాళాలు అందించారు. నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు లేనప్పటికీ, భద్రతను మరింత కఠినతరం చేశారు.
తాజావార్తలు
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
-
Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
-
Sajjala Ramakrishna Reddy : స్థానిక పోరుపై కూటమికి సజ్జల సవాల్
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!