NTV Telugu Site icon

Puri Jagannadh : యుద్ధం అనివార్యం అంటున్న డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్

Puri Jagannadh

Puri Jagannadh

Puri Jagannadh : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో సరికొత్త టాపిక్ తీసుకొచ్చాడు. టాపిక్ పేరు ‘ఎండ్ లెస్ బాటిల్’. మరి పూరి మాటల్లోనే ‘ఎండ్ లెస్ బాటిల్’ అంటే ఏంటో విందాం. పూరి మాటల్లో.. ‘అనంత మహాసముద్రం.. అరుస్తున్న కెరటాలు.. అదుపు తప్పిపోయిన గాలులు.. అలలపై కలల మధ్య గుంపులుగా చేరిన జనం. ఎలాగూ పోతాం.. తప్పించుకునేందుకు మరో దారేలేదు. అందుకే పోయే ముందు బతుకుదాం. అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం, అర్థం పరమార్థం ఏంటో తేల్చేద్దాం. ఇంకా నడి మధ్యనే ఉన్నాం. ఇంకెంత దూరమో ఈ ప్రయాణం. గత ప్రయాణం అదొక కథ. రేపటి ప్రయాణం మరొక కథ. పిట్ట కథలు మనకెందుకు ? ఇప్పుడే ఇక్కడే తాపీగా బతికేద్దాం. మళ్లీ మబ్బులు.. చంపుకుని తినే చినుకులు. ఇది వానో పెను తుపానో! పడవలోకి నీరొస్తే.. పరదా చిరిగిపోతే.. భయపడేదేలే. వలలో ఒక్క చేపా చిక్కలే.. అయితేనేం ? పస్తులుందాం.. ఫర్వాలేదు. ఇవాళ ఆకలితో కడుపు మాడితే.. రేపటి వేట తీరు వేరేలా ఉంటుంది.

Read Also:PM Modi: నేడు రోజ్‌గార్‌ మేళా.. 71 వేల మందికి నియామక పత్రాలను అందించనున్న ప్రధాని మోడీ

సొర చేపలు చిక్కకపోతాయా? ఏదీ నేర్చుకోకుండా ఏ రోజూ ఉండకు. ఎండకుండా.. వేటాడకుండా నిద్రలోకి జారుకోకు. ఏంటో ఎగిరెగిరి పడుతోంది పడవ. చలిగాలి ఒక పక్క.. చల్లటి జల్లు మరో పక్క. తడిసిన ఒళ్లు.. పెదాలపై ఉప్పు నీళ్లు. ఒళ్లంతా వణుకు.. కళ్లల్లో బెణుకు. ఎముకల్లో ఆవహించిన నిస్సత్తువ. అయినా నా అన్న వారిని వదులుకోకునే ప్రసక్తే లేదు. సాయం చేసిన చేతిని ఎప్పటికీ మరవకు. పిడుగొచ్చి మీద పడినా కెరటం ఢీ కొట్టినా ఆ చేయిని వదలకు. తమ్ముడా.. ఇక్కడ అందరిది ఒకే పడవలో ప్రయాణం. అదిగో పొగరెక్కిన తరంగం. ఉప్పొంగిన హిమాలయం. ప్రతి కెరటం.. ముంచాలనే, ఆదమరిస్తే చంపాలనే. ఆపకు తమ్ముడూ తెడ్డు వేయడం మానకు. ఎదురెళ్లి ఎక్కేసి దూకేయ్. ఈ అనంత కడలిలో మనమెంత? పడవెంత? ఇసుకెంత? అయినా.. సంద్రాన్ని చీల్చుకుంటూ పోదాం. కొడవళ్లై కోసుకుంటూ పోదాం. అమ్మ వద్దన్నా, దేవుడు అడ్డుపడినా పులులై దూకేద్దాం, సింహాలై గర్జిద్దాం. తనతో తానే తలపడితే గౌతమ బుద్ధ సిద్ధార్థ. తలలు నరుకుతావో తలే నరుక్కుంటావో! తమ్ముడా.. ఇక్కడ యుద్ధం అనివార్యం’’ అంటూ ఆయన ముగించారు.

Read Also:CRDA Meeting: రేపు సీఆర్డీఏ 44వ అథారిటీ స‌మావేశం