NTV Telugu Site icon

Jammu: జమ్మూలో బాణాసంచా అమ్మకాలపై నిషేధం

Mdoid'

Mdoid'

ప్రధాని మోడీ (PM Modi) మంగళవారం జమ్మూలో (Jammu) పర్యటించనున్నారు. రూ.13,375 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. నేటి నుంచి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు క్రాకర్స్‌పై నిషేధం విధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొ్న్నారు.  ఇప్పటికే డ్రోన్లు ఎగురవేతను నిషేధించింది.

 

ప్రధాని మోడీ జమ్మూలో నిర్మించిన ఎయిమ్స్‌ను మంగళవారం ప్రారంభించబోతున్నారు. ఈ ఆస్పత్రికి పునాది రాయిని మోడీ 2019 ఫిబ్రవరిలో వేశారు. అంతేకాకుండా 48.1 కి.మీ పొడవైన బనిహాల్-సంగల్దాన్ రైల్వే సెక్షన్‌ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ రైలు విభాగం కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతూ 272 కి.మీ పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు తిరిగనుంది. జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత ప్రధాని మోడీ చేపట్టిన రెండో పర్యటన ఇది. ప్రధాని ఈ పర్యటనను జాతికి అంకితం చేయనున్నారు.

 

ఇదిలా ఉండగా జమ్మూ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ కొత్త టెర్మినల్ 40 వేల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 2000 మంది ప్రయాణికులకు సేవలను అందించవచ్చు. దీనితో పాటు, ఈ టెర్మినల్‌లో ఆధునిక సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో జమ్మూ – కత్రా మధ్య నిర్మించిన ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే రెండు ప్యాకేజీలతో పాటు ఇతర ముఖ్యమైన రహదారి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. జమ్మూలో కామన్ యూజర్ ఫెసిలిటీ పెట్రోలియం డిపోను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కూడా మోడీ శంకుస్థాపన చేస్తారు.