Site icon NTV Telugu

LSG vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

Ipl

Ipl

ఐపీఎల్ లో నేడు మరో రసవత్తర మ్యాచ్ కు అంతా రెడీ అయ్యింది. నేడు లక్నో సూపర్‌ జెయింట్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా ఇరుజట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా లక్నో బ్యాటింగ్ కు దిగనుంది. లక్నో, పంజాబ్ జట్లలో విధ్వంసకర బ్యాటర్లు ఉండడంతో ఈ మ్యాచ్ హీట్ పెంచేస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ లో బోణీ కొట్టిన ఇరుజట్లు మరోవిజయంపై కన్నేశాయి. ఈ మ్యా్చ్ లో విజయం సాధించాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.

Exit mobile version