PBKS vs GT: వైశాఖ్ అద్భుతమైన బౌలింగ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

  • గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 06 వికెట్ల నష్టానికి 162 పరుగులు
  • పంజాబ్ కు 163 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది
  • వైశాఖ్ తన 4 ఓవర్లలో 3/34 గణాంకాలతో అద్భుతం
Shubhman

Shubhman

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో భాగంగా నాలుగవ మ్యాచ్ పంజాబ్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 06 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పంజాబ్ కు 163 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. గుజరాత్ తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించిన శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వేగంగా ఆరంభించారు. అయితే, నాలుగో ఓవర్‌లోని నాలుగో బంతికి మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ (13) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత జోస్ బట్లర్, శుభ్‌మన్ గిల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు, కానీ గిల్ 39 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

గ్లెన్ ఫిలిప్స్ (25) 119 పరుగుల వద్ద విజయకుమార్ వైశాఖ్ బౌలింగ్‌లో అవుటవడంతో గుజరాత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. జోస్ బట్లర్ (38) కూడా మంచి ఫామ్‌లో కనిపించినా, చాహల్ స్పిన్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే, వాషింగ్టన్ సుందర్ కూడా 18 పరుగుల వద్ద విజయకుమార్ వైశాఖ్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ చేతికి చిక్కాడు.

వైశాఖ్ తన 19వ ఓవర్‌లోని చివరి బంతికి షారుఖ్ ఖాన్ (4)ను ఔట్ చేశాడు. వైశాఖ్ తన 4 ఓవర్లలో 3/34 గణాంకాలతో పంజాబ్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. యజ్వేంద్ర చాహల్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్ కూడా 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు.