Site icon NTV Telugu

PBKS vs GT: టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

Pbks Vs Gt

Pbks Vs Gt

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో భాగంగా నాలుగవ మ్యాచ్ మంగళవారం (మార్చి 31) నాడు న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో ఉన్న మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో పంజాబ్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. పంజాబ్ కింగ్స్ నేడు తమ సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఇరు జట్లు ఈ మ్యాచ్‌తో తమ సీజన్‌ను ప్రారంభిస్తాయి. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ల ఫామ్‌పై అందరి ఫోకస్ ఉంది. ఈ మ్యాచ్ కోసం ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కు దిగనున్నది.

పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విశాల్ విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

గుజరాత్ టైటాన్స్‌: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కాగిసో రబాడా, అశోక్ శర్మ,మహ్మద్ సిరాజ్

Exit mobile version