ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఇరు జట్లు చెరో 10 మ్యాచ్ లు ఆడగా.. ఐదు మ్యాచ్ ల్లో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించి ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది.
Also Read : Jaganannaku Chebudam: జగనన్నకు చెబుదాం… ఏ సమస్యలకు.. ఎలా పరిష్కారం అంటే..?
ఈ సీజన్ లో రెండు జట్లు ముఖాముఖిగా తలపడడం ఇది రెండోసారి. గత మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 7 పరుగుల తేడాతో కోల్ కతాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని కేకేఆర్ టీమ్ భావిస్తోంది. ఈ పిచ్ గతంలో కంటే కొంచెం పొడిగా కనిపిస్తోంది. స్పిన్నర్లకు ఇది కొంచెం ఎక్కువగా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది.
Also Read : Dead Pixels Trailer: దానికోసం పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన నిహారిక
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్(w), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చకరవర్తి.
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(సి), భానుకా రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
