Site icon NTV Telugu

Punjab: మరోసారి తండ్రయిన ముఖ్యమంత్రి

Cm Wife

Cm Wife

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య గురుప్రీత్ కౌర్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మాన్ ‘ఎక్స్‌’ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. పాప ఫొటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దేవుడు కుమార్తెను బహుమతిగా ఇచ్చాడని.. తల్లి, బిడ్డ లిద్దరూ క్షేమంగా ఉన్నారని భగవంత్ మాన్ తెలిపారు. బిడ్డను దీవించాలని ఆయన కోరారు. లూథియానాలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో ప్రసవం జరిగింది.

భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన గురుప్రీత్ కౌర్ అనే డాక్టర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యతో దూరంగా ఉండడంతో గురుప్రీత్ కౌర్‌ను మరో పెళ్లి చేసుకున్నారు.

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారీ మెజార్టీతో పంజాబ్ ప్రజలు పట్టంకట్టారు. అనంతరం కేజ్రీవాల్.. భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఇదిలా ఉంటే ఆప్.. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ పంజాబ్‌లో మాత్రం ఆమ్ ఆద్మీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. అన్ని స్థానాల్లో సింగిల్‌గానే పోటీ చేస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: AP High Court: మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట

ఇదిలా ఉంటే ఈడీ అధికారులు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడంపై మాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం ఈడీని అడ్డంపెట్టుకుని కుట్ర రాజకీయాలకు చేస్తోందని ఆయన ఆరోపించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 10th Class Exam: పరీక్షలో ఆన్సర్స్ చూపించలేదని కత్తితో దాడి చేసిన విద్యార్థులు..

 

Exit mobile version