Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Borewell Rescue: పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో బోర్వెల్లో పడిపోయిన చిన్నారిని దాదాపు 10 గంటల పాటు సాగిన ఉత్కంఠభరిత రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించగా, చివరకు చిన్నారి క్షేమంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఘటనపై అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో హోషియార్పూర్ జిల్లాలోని చక్ సవానా గ్రామంలో చోటుచేసుకుంది. ఆడుకుంటూ ఉన్న చిన్నారి ప్రమాదవశాత్తు 300 అడుగుల లోతున్న బోర్వెల్లో పడిపోయాడు. అయితే చిన్నారి సుమారు 90 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. హోషియార్పూర్ ఎంపీ రాజ్ కుమార్ చబ్బేవాల్, పంజాబ్ మంత్రి రవ్జోత్ సింగ్, జిల్లా ఎస్ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులు కూడా రెస్క్యూ పనులను పర్యవేక్షించారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
చిన్నారిని రక్షించేందుకు బోర్వెల్లో ప్రత్యేక కెమెరాలను పంపించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం నాలుగు జేసీబీ యంత్రాలతో భారీ ఎత్తున తవ్వకాలు చేపట్టారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తులు కలిసి నిరంతరం శ్రమించి చిన్నారి వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. దాదాపు 10 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ చివరికి విజయవంతమైంది. అర్ధరాత్రి సమయంలో రెస్క్యూ సిబ్బంది చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. చిన్నారి బయటకు రావడంతో అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
చిన్నారిని రక్షించిన వెంటనే వైద్య పరీక్షల కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. బోర్వెల్లో గంటల పాటు చిక్కుకుపోవడంతో ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడిందో వైద్యులు పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. త్వరితగతిన స్పందించి చిన్నారి ప్రాణాలను కాపాడిన రెస్క్యూ బృందాలకు చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
#WATCH | Punjab | The three-year-old child who fell into a borewell in Hoshiarpur's Chak Sawana village has been safely rescued https://t.co/x3dmkC7QAF pic.twitter.com/JsxfIMYDGc
— ANI (@ANI) May 15, 2026
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!