Site icon NTV Telugu

PBKS vs KKR: విజృంభించిన చాహల్.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం

Chahal

Chahal

ఐపీఎల్ లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం సాధించింది. పంజాబ్ జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 15.1 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. చాహల్ 4 వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు శుభారంభం లభించింది. ప్రియాంష్ ఆర్య మంచి షాట్లు ఆడాడు. కానీ నాల్గవ ఓవర్లో ప్రియాంష్ ఆర్యను హర్షిత్ రాణా అవుట్ చేశాడు. ఆర్య బ్యాట్ నుంచి 22 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత పంజాబ్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి.

నాల్గవ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ కూడా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. జోష్ ఇంగ్లిస్ కూడా తర్వాతి ఓవర్లో ఔటయ్యాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ కూడా ఔట్ అయ్యాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ కేవలం 30 పరుగులు మాత్రమే సాధించాడు. 9వ ఓవర్లో నెహాల్ వాధేరా కూడా 10 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.

Exit mobile version