NTV Telugu Site icon

Puneet Superstar: రీల్స్ కోసం ఇంత హంగామా అవసరమా..? గేదె మూత్రం, పేడతో ఏకంగా..(వీడియో)

Puneet Superstar

Puneet Superstar

Puneet Superstar: ప్రస్తుత కాలంలో మనిషి నిజ జీవితంలో కంటే సోషల్ మీడియాలో గడిపేస్తున్నాడన్న నిజంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడంతో చాలామంది రోజులో చాలావరకు సోషల్ మీడియాకు అంకితం అవుతున్నారు. ఇది ఇలా ఉంటే.. మరికొందరు సోషల్ మీడియాలో పాపులర్ చేయకూడని చేయకూడని పనులు చేస్తూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రీల్స్ చేస్తున్న సమయంలో చాలామంది రిస్క్ తీసుకొని చివరికి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేకమంది వికలాంగులు కూడా అయ్యారు. కంటెంట్ కోసం చిత్ర విచిత్ర పనులు చేస్తూ పేరు తెచ్చుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. తాజాగా పునీత్ సూపర్ స్టార్ అని పిలవబడే ప్రకాష్ కుమార్ చేసిన పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారితీస్తోంది. ఇంతకు అతడు ఏం చేశాడన్న విషయాన్ని చూస్తే..

Chandrababu Naidu: ఎలక్ట్రానిక్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి..

పునీత్ సూపర్ స్టార్ గా ప్రసిద్ధి చెందిన ప్రకాష్ కుమార్ అతి ఉత్సాహం చూపించిన రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాస్యబరితమైన వీడియోలకి ప్రసిద్ధి చెందిన ఆయన తాజాగా ఒక వీడియోలో గేద మూత్రం నేరుగా తాగుతున్నట్లుగా కనపడుతుంది. మరో వీడియోలో గేద పేడతో అతని ముఖానికి మొత్తం పూసుకోవడం, అలాగే అదే ప్రదేశంలో కింద పడి దొర్లడం లాంటి పనులు చేయడం మనకు కనబడుతుంది. ఈ వీడియోలకు ఇప్పటివరకు ఓ వీడియోకి మూడు మిలియన్స్ పైగా వ్యూస్ రాగా.. మరో వీడియోకి 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ కోసం మరి ఇంతలా అతి చేయాల్సిన అవసరం లేదంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మంచి విషయాలను కూడా నువ్వు వక్రీకరిస్తున్నావు అంటూ మరికొందరు ఘాటుగా స్పందిస్తున్నారు.

Show comments