NTV Telugu Site icon

Dead Human Bones : స్వామి చెప్పాడని శ్మశానానికి తీసుకెళ్లి శవాల బూడిద తినిపించారు

Bengaluru Case

Bengaluru Case

Dead Human Bones : పుణెలో దారుణం చోటు చేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని ఓ వివాహిత పట్ల ఆమె భర్త, అత్తమామలు అమానవీయంగా ప్రవర్తించారు. తాంత్రికుడు చెప్పాడని ఆమెను శ్మశానానికి తీసుకెళ్లి అక్కడ శవాల బూడిదను తినిపించారు. మహిళ ఫిర్యాదు మేరకు పుణె పోలీసులు బుధవారం.. భర్త, అత్తమామలు, తాంత్రికుడితో సహా ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుహైల్ శర్మ మాట్లాడుతూ.. పుణెలో నివాసముంటున్న ఓ మహిళకు 2019లో వివాహం జరిగింది.

Read Also: Dera Baba: పెరోల్ పై బయటకు వచ్చిన బాబా.. మరి ఈ సారి డేరా ఎక్కడో

అప్పటి నుంచి ఆ దంపతులకు పిల్లలు పుట్టలేదు. అత్తమామలకు భయం మొదలైంది. ఈ క్రమంలోనే వారు ఓ తాంత్రికుడిని కలిశారు.. అమావాస్య సమయాల్లో..ఇంట్లో మహిళ చేత విచిత్ర పూజలు చేయించారు. అంతేకాకుండా.. వివిధ శ్మశానవాటికలకు తీసుకెళ్లేవారు. మరణించిన మనుషుల ఎముకలను తినిపించేవారు. తినకపోతే ఎముకల పొడిని బాధితురాలి నోట్లో బలవంతంగా పెట్టేవారు. ఇలా చాలాసార్లు జరిగింది. అన్ని సందర్భాల్లోనూ.. ఆ తాంత్రికుడు వీడియో కాల్, ఫోన్​ కాల్​​లో సూచనలు చేస్తూనే ఉన్నాడు. ఇంకొన్ని సందర్భాల్లో మహిళను ఓ జలపాతం వద్దకు తీసుకెళ్లి.. అఘోరీలు చేసే పనులు కూడా చేయించారు.

Read Also:TTD: తిరుమలలో డ్రోన్‌ కలకలం.. టీటీడీ కీలక నిర్ణయం..!

అత్తమామలు, భర్త వేధింపులు తట్టుకోలేక పోయిన బాధితురాలు.. చివరికి పోలీసులను ఆశ్రయించింది. బ్లాక్​ మేజిక్​తో పాటు అత్తమామలపై వేధింపుల కేసు కూడా వేసింది. కట్నం కింద నగదు, బంగారం, వెండి ఆభరణాలను డిమాండ్​ చేస్తున్నారని పేర్కొంది. ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. ఏడుగురిపై సెక్షన్​ 498 ఏ, 323, 504, 506తో పాటు యాంటీ సూపర్​స్టీషన్​ యాక్ట్​లోని 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళ వేర్వేరు విషయాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదటి కేసులో, తన అత్తమామలు పెళ్లి సమయంలో (2019లో) నగదు, బంగారు, వెండి ఆభరణాలు సహా కట్నం డిమాండ్ చేశారని ఆరోపించింది. ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తూ ఏడుగురు నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ శర్మ తెలిపారు.