Puncture Mafia: కొత్త రకం మాఫియా.. బెంగళూరులో వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puncture Mafia: లిక్కర్ మాఫియా, డ్రగ్ మాఫియాతోపాటు రియల్ ఎస్టేట్ మాఫియా చూశాం.. కానీ బెంగళూరులో ఈ మధ్య కొత్త మాఫియా పుట్టుకొచ్చింది. అదే పంక్చర్ మాఫియా.. అదేంటీ పంక్చర్ మాఫియా ఎంటనీ ఆచ్చర్యపోతున్నారా? అవును ఇది నిజం. ఐటీ హబ్‌గా పేరున్న బెంగళూరు నగరంలో పంక్చర్ మాఫియా వచ్చింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌ను స్కూటీ పంక్చర్ అయ్యేలా పంక్చర్ షాపులకు దగ్గరలో చిన్న మేకులు, మొనదేలిన తీగలను వేసి కారు, బైక్ టైర్లు పంక్చర్ అయ్యేలా చేసి.. వారు తమ పంక్చర్ షాపుకు వచ్చేలా చేసుకుంటున్నారు మాఫియాదారులు.. అదేంటో చూద్దాం..
బైక్‌పై గానీ లేదా కార్‌లోగానీ వెళుతుంటే ప్రయాణం మధ్యలో టైర్ పంక్చర్ అయితే ఎంతో కష్టంగా ఉంటుంది.. రాత్రిపూట బైక్ పంక్చర్ అయినా.. లేకపోతే కుటుంబంతో వెళుతున్న సమయంలో కారు పంక్చర్ అయినా ఎంతో నరకం చూస్తాం. ఆ టైమ్‌లో పంక్చర్ షాపుల కోసం వెతుక్కోవడం.. దగ్గరలో ఉన్న వారిని పంక్చర్ షాపు ఎక్కడ ఉందని అడిగి దగ్గరలో ఉన్న పంక్చర్ షాపుకు వెళతాం.. టైర్ పంక్చర్ వేయించుకొని తిరిగి మన ప్రయాణం కొనసాగిస్తాం. ఇప్పుడు బెంగళూరులో పంక్చర్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. బెంగళూరు శివారులో పంక్చర్ దుకాణానికి అటూ ఇటుగా కిలోమీటర్ సమీపానికి రాగానే వాహనం టైరు పంక్చర్ అవుతోంది. దగ్గర్లోని పంక్చర్ షాపు వద్దకు వాహనాన్ని తీసుకెళ్తే.. వాళ్లు ట్యూబ్ పాడైందని, ఇంకేదో అయ్యిందని చెప్పి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కొంత మందైతే.. టైరు కూడా పాడైందని చెప్పి మార్పిస్తున్నారు. తరచూ ఇలా జరుగుతుండటంతో కొంత మంది వాహనదారులకు అనుమానం కలిగింది. ఏంటని ఆరా తీయడంతో కొత్త రకం మాఫియా గుట్టు రట్టైంది.
Also Read
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
పంక్చర్ దుకాణం ఉన్న చోటుకు ఒక కిలోమీటర్ పరిధిలో రోడ్లపై చిన్న మేకులు, మొనదేలి ఉన్న తీగలను పంక్చర్ షాపుకు సంబంధించిన వారే పడేస్తారు. కొంత మంది ముఠాగా ఏర్పడి ఇలా చేస్తున్నారు. మేకులు గుచ్చుకోగానే టైర్లు, ట్యూబులు పంక్చర్ అవుతాయి. వాహనదారులు సహజంగానే సమీపంలో పంక్చర్ షాపు ఎక్కడ ఉందో ఆరా తీసి, అక్కడికి వెళ్తారు. దీంతో వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. బెంగళూరు నగర శివార్లలో ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువ కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అశోకనగర పోటీస్ స్టేషన్ పరిధిలోని దత్తపీఠానికి వెళ్లే మార్గంలో వందలాది మేకులు, ఇనుప చువ్వలను పోలీసులు సేకరించారు. అనేపాళ్య, నంజప్ప కూడలి, అపేరా జంక్షన్ సమీపంలోనూ ప్రతిరోజూ కిలోలకొద్దీ మేకులు, ఇనుప తీగలు ట్రాఫిక్ పోలీసులకు లభిస్తున్నాయి. ఈ మార్గాల్లో మేకులు వేసే మాఫియా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మార్గాల్లో సీసీ కెమెరాలను మరిన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!