NTV Telugu Site icon

Punarnavi : బిగ్ బాస్ బ్యూటి పునర్నవి బాయ్ ఫ్రెండ్ ఇతనేనా?

punarvi

punarvi

బిగ్ బాస్ బ్యూటి పునర్నవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఉయ్యాలా జంపాలా సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్స్ తో మెప్పించి 2019లో బిగ్ బాస్ లో పాల్గొని పాపులారిటీ తెచ్చుకుంది.. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఒక పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతున్నాయి..

గతంలో పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ తో రిలేషన్ లో ఉందని వార్తలు వచ్చినా అవి కొట్టిపారేశారు ఇద్దరూ. తాజాగా పునర్నవి తన సోషల్ మీడియాలో ఒక అబ్బాయితో దిగిన ఫోటో పోస్ట్ చేసి విషెష్ చెప్పింది.. ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.. ఆ పోస్ట్ లో కొండల్లో ఎక్కడో దిగినట్లు తెలుస్తుంది. ఫొటోలో వాళ్ళు వెనక్కి తిరిగి కూర్చున్న ఫోటోని పోస్ట్ చేయడంతో ముఖాలు కనిపించట్లేదు.. కానీ పునర్నవి వెనక్కి తిరిగి అబ్బాయి మీద చెయ్యి వేసుకొని కనిపిస్తుంది..

పునర్నవి ఈ ఫోటో షేర్ చేసి.. నా ఒక్కగానొక్క లవ్ కి హ్యాపీ బర్త్ డే అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ను చూసి అందరు బాయ్ ఫ్రెండ్ అని అందరు అనుకున్నారు. ఇక ఈ అమ్మడు ఇప్పటిలో ఏ ఒక్క సినిమాలో కనిపించలేదు.. బిగ్ బాస్ తర్వాత తనకి పలు అవకాశాలు వచ్చినా ఓ సిరీస్ లో నటించి, పలు టీవీ షోలలో కనిపించి అనంతరం చదువుకోడానికి లండన్ వెళ్ళింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.