NTV Telugu Site icon

Pulwama Terror Attack: పుల్వామా అమర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు

Modi

Modi

PM Narendra Modi: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. పుల్వామాలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తున్నాను అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ట్విట్టర్ (ఎక్స్‌)లో ప్రధాని మోడీ తెలిపారు. దేశం కోసం వారు చేసిన సేవలు, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు.

Read Also: Notices To Rebel MLAs: రెబల్‌ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్‌ నోటీసులు..

ఇక, జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి జరిగి ఇవాళ్టికి ఐదేళ్లు పూర్తి అయ్యాయి. కాగా, పుల్వామా ఉగ్రదాడి 2019, ఫిబ్రవరి 14న జరిగింది. భారతదేశంపై జరిగిన భారీ తీవ్రవాద దాడుల్లో ఇది కూడా ఒకటి.. ఆ చీకటి రోజున ఉగ్రవాదులు 200 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు మరణించారు. ఈ ఘటనలో మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరోజు సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌లో 78 వాహనాలు ఉండగా, వాటిలో 2500 మందికి పైగా సైనికులు ప్రయాణించారు.