ZPTC By-Election: వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ కొన్ని ఘర్షణలతో పోలింగ్ సాగింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. రెండు చోట్లా 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు టీడీపీ, వైసీపీ మధ్యే జరిగింది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి.. ఒంటిమిట్టలో ముద్దు కృష్ణారెడ్డి (టీడీపీ), ఇరగం రెడ్డి (వైసీపీ) తలపడ్డారు. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు.
READ MORE: AP Nominated Posts: ఏపీలో 31 నామినేటెడ్ పోస్టుల భర్తీ.. పూర్తి లిస్ట్ ఇదే..
మరోవైపు భారీ భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లు కడపకు తరలించారు. అయితే తాజాగా పోలింగ్ వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఒంటిమిట్ట టోటల్ పోలింగ్ పర్సంటేజ్ 79.39% నమోదైనట్లు తెలిపారు. పులివెందులలో 76.44 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు. ఒంటిమిట్టతో పోలిస్తే పులివెందులతో తక్కువ పోలింగ్ నమోదైంది. ఇక తుది ఫలితాలు ఈ నెల 14న వెల్లడించనున్నారు.
READ MORE: TTD: తిరుమలకు వెళ్లే వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై అది లేకుంటే నో ఎంట్రీ..!
