Site icon NTV Telugu

Public Holidays 2024: వచ్చే ఏడాదిలో గవర్నమెంట్ హాలిడేస్ ఇవే.. ఆ నెలలోనే ఎక్కువ..

2024 Holidays

2024 Holidays

ప్రతి నెలలో ఎన్నో కొన్ని ప్రభుత్వ సెలవులు ఉంటాయి.. అలాగే వచ్చే ఏడాదికి గాను సెలవుల లిస్ట్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.. జనవరి, ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో అత్యధిక సెలవులు ఉన్నాయి. జనవరిలో ఐదు సెలవులు ఉంటే .. ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఐదు, ఆరు సెలవులు ఉన్నాయి. మరోవైపు ఫిబ్రవరి, మే, నవంబర్ నెలల్లో ఒక్క సాధారణ సెలవుకూడా లేదు. 2024 ఏడాది మొత్తం 25 సాధారణ సెలవులు వచ్చాయి. ఈ లిస్ట్ ప్రకారం వచ్చే ఏడాదిలో ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

2024 లో ఉన్న నార్మల్ హాలీడేస్ ఇవే..

జనవరి 1 (సోమవారం) – న్యూ ఇయర్ డే
జనవరి 14( ఆదివారం) – బోగి
జనవరి 15 (సోమవారం) – సంక్రాంతి
జనవరి 16 (మంగళవారం) – కనుమ
జనవరి 26 (శుక్రవారం) – రిపబ్లిక్ డే
మార్చి 8 (శుక్రవారం) – మహాశివరాత్రి
మార్చి 29 (శుక్రవారం) – గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 5 (శుక్రవారం) – బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 9 ( మంగళవారం) – ఉగాది
ఏప్రిల్ 10( బుధవారం) – రంజాన్
ఏప్రిల్ 14 (ఆదివారం) – బి.ఆర్. అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 17 (బుధవారం) – శ్రీరామనవమి
జూన్ 17 ( సోమవారం) – బక్రీద్
జూలై 17 (బుధవారం) – మొహర్రం

ఆగస్టు 15 (గురువారం) – స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 26 (సోమవారం) – శ్రీ కృష్ణఅష్టమి
సెప్టెంబర్ 7 (శనివారం) – వినాయకచవితి
సెప్టెంబర్ 16 (సోమవారం) – ఈద్ మిలాదున్ నబీ
అక్టోబర్ 2( బుధవారం) – మహాత్మాగాంధీ జయంతి
అక్టోబర్ 11 (శుక్రవారం) – దుర్గాష్టమి
అక్టోబర్ 12 (శనివారం) – మహర్ నవమి
అక్టోబర్ 13 ( ఆదివారం) – విజయదశమి
అక్టోబర్ 30 (బుధవారం)- నరకచతుర్ధశి
అక్టోబర్ 31 (గురువారం) – దీపావళి
డిసెంబర్ 25 (బుధవారం) – క్రిస్టమస్

ఈరోజుల్లో బ్యాంకులు పని చెయ్యవు.. ఏదైనా పని ఉంటే ముందే చూసుకోవడం మంచిది..

Exit mobile version