PSL 2026 Ball Tampering: పాకిస్థాన్ లీగ్‌లో బాల్ ట్యాంపరింగ్.. బజారున పీఎస్‌ఎల్ పరువు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSL 2026 Ball Tampering: పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా ఐపీఎల్‌ను చూసి పీఎస్ఎల్ నిర్వహిస్తోంది పాకిస్థాన్. పీఎస్ఎల్ (PSL) 2026 సీజన్‌లో ఒక్కొక్కటిగా వివాదాలు బయటపడుతున్నాయి. ప్రారంభం మ్యాచ్‌లో వైట్ బాల్ పింక్ బాల్‌గా మారిన వివాదాన్ని చూశాం. తాజాగా లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ మరో వివాదం పుట్టుకొచ్చింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో లాహోర్ జట్టుకు ‘బాల్ ట్యాంపరింగ్’ ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా ఐదు పరుగుల పెనాల్టీ విధించడం పెను సంచలనంగా మారింది. హారిస్ రవూఫ్ చివరి ఓవర్ వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో, అంపైర్ ఫైసల్ అఫ్రిది బంతిని తనిఖీ చేశాడు. ఆ బాల్ ఆకారం ఉద్దేశపూర్వకంగా మార్చారని నిర్ధారించారు. ఐదు పరుగులు పెనల్టీ విధించారు. దీంతో కరాచీ కింగ్స్ లక్ష్యం 14 పరుగుల నుంచి ఒక్కసారిగా 9 పరుగులకు తగ్గిపోయింది.
READ MORE: CM Chandrababu: నాయుడుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన.. పుదూరులో టిడ్కో గృహాల ప్రారంభం!
Also Read
- Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
- Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
- Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
- Metro Express: కరీంనగర్లో 'సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్' బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
ఈ నిర్ణయంపై లాహోర్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది మైదానంలోనే తీవ్ర అసహనం వ్యక్తం చేసినప్పటికీ, మ్యాచ్ అనంతరం మాత్రం చాలా సంయమనంతో స్పందించారు. “అక్కడ అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. కెమెరా ఫుటేజీని చూసిన తర్వాతే దీనిపై ఒక నిర్ణయానికి వస్తాం. ఐదు పరుగులు పెనాల్టీగా ఇచ్చేశారు. ఇప్పుడు మేము చేయగలిగింది ఏమీ లేదు” అంటూ షాహీన్ సమాధానమిచ్చాడు. అబ్బాస్ అఫ్రిది ఆఖరి ఓవర్‌లో ఫోర్, సిక్సర్‌తో చెలరేగడంతో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక ఈ బాల్ ట్యాంపరింగ్‌పై సోషల్ మీడియాలో చర్చలు ఊపంపుదుకున్నాయి. నెటిజన్లు పీఎస్‌ఎల్‌పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఒక లీగ్ మ్యాచ్‌లో గెలిచేందుకు మరీ ఇంతలా దిగజారాలా? అంటూ తిట్టిపోస్తున్నారు. పాకిస్థాన్ లీగ్ పరువు బజారున పడుతోందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
తాజావార్తలు
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
-
Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
-
SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
-
ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!