PS Girisha: అసెంబ్లీ ఎన్నికల వేళ ఐఏఎస్ అధికారి పీఎస్ గిరీషా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో ఆయన పలు అభియోగాలు ఎదుర్కొన్నారు. తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి పీఎస్ గిరీషాపై విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ను నియమించింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలపై గిరీషాను జనవరిలో ఈ సీ సస్పెండ్ చేసింది.
READ MORE:Gilli Re- Release : కళ్లు చెదిరే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విజయ్ “గిల్లి” మూవీ..
గిరీషాపై సస్పెన్షన్ గత వారంలో ఎత్తేసిన ప్రభుత్వం.. తిరిగి విధుల్లోకి తీసుకుంది. తనపై ఉన్న అభియోగాలు రద్దు చేయాలని ఫిబ్రవరిలో ప్రభుత్వానికి గిరీషా విన్నవించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ మేరకు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సురేష్ కుమారుకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర విచారణ తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.