Protest : అన్ని మౌళిక వసతులు కల్పిస్తామని మోడీ బిల్డర్స్ మోసం.. రోడ్డెక్కిన అపార్ట్మెంట్ వాసులు
- బిల్డర్ మోసాలకు బలైన గుల్ మెహర్ రెసిడెన్సీ వాసులు
- నీటి, విద్యుత్, పార్కింగ్ లేని జీవితం.. రెసిడెంట్ల ఆవేదన
- సొంతింటి కల భగ్నం చేసిన మోడీ బిల్డర్స్పై ధర్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Protest : అపార్టుమెంట్లలో అన్ని మౌళిక వసతులు కల్పిస్తామని నమ్మించి మోడీ బిల్డర్స్ మోసం చేశారంటూ హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలోని గుల్ మెహర్ రెసిడెస్సీ వాసులు ఆందోళన బాట పట్టారు. నెలల తరబడి సరైన వసతులు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నా బిల్డర్స్ పట్టించుకోవటం లేదని గుల్ మెహర్ రెసిడెన్సీ ఎదుట ప్లాకార్డులు చేత పట్టి ధర్నానిర్వహించారు. గెటెడ్ కమ్యూనిటీ, అన్ని హంగులంటూ ఆర్భటపు ప్రకటనలు చూసి ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే ఉందని బాధితులు వాపోతున్నారు. మొత్తం 8 బ్లాకులకు కలిసి 7 బోర్లున్నాయనీ, మంజీరా వాటర్, పార్కింగ్ సౌకర్యాలు, లిప్టు వసతి కల్పిస్తామని చెప్పిన బిల్డర్ కేవలం ఒకే బోరుతో అన్ని బ్లాకులకు చాలీచాలని నీటితో, విద్యుత్, పార్కింగ్ సమస్యలతో సతమతమౌతున్నామని చెబుతున్నారు. ఎదేమని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.
ఎన్నో ఆశలతో సొంతింటి కళ నెరవేర్చుకున్నామనే ఆనందం లేకుండా పోతుందని, రిటైర్మెంట్తో వచ్చిన డబ్బులతో ఇక్కడ ప్లాటు కొనుగోలు చేసి ఇబ్బందులకు పడుతున్నామంటున్నారు. పార్కింగ్ స్ధలంలో డ్రైనేజీ, వర్షం నీరు నిలవడం, తరచూ విద్యుత్ సమస్యలు, లిప్టు ఎప్పుడు పనిచేస్తుందో తెలియని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసీ రకంతో నిర్మాణపు పనులు చేపట్టారనీ భవనం పెచ్చులూడి పోతున్నాయనీ సదరు బిల్డరుకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు సరైన వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఫ్లాటు యజమానులు కోరుతున్నారు. ఇక్కడి రెసిడెన్సీలో 8 బ్లాకుల్లో 340 ప్లాట్లు ఉండగా ప్రస్తుతం 225 ఫ్లాట్లలో యజమానులు నానా ఇక్కట్లకు గురవుతున్నట్లు బాధితులు చెబుతున్నారు.
Also Read
- Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
- Supreme Court: "ఆంక్షలు విధించడానికి మీరెవరు?".. నల్సార్ లా వర్సిటీ అంశంలో BCIకి సుప్రీంకోర్టు చురకలు..
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Viswanath and Sons Review: విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ.!
Delhi: బాలుడి హత్య కేసులో లేడీడాన్ జిక్రా అరెస్ట్.. ఆమె ఎవరంటే..!
తాజావార్తలు
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Supreme Court: “ఆంక్షలు విధించడానికి మీరెవరు?”.. నల్సార్ లా వర్సిటీ అంశంలో BCIకి సుప్రీంకోర్టు చురకలు..
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్‌కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
-
PrabhasDp : 7 ఏళ్ల తర్వాత డీపీ మార్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియా షేక్..షేక్
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!