NTV Telugu Site icon

Bihar: బీహార్లో దారుణం.. పోలీస్ ఇంట్లోనే వ్యభిచారం

Bihar

Bihar

Bihar: బీహార్‌లో ఓ దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. మారుమూల ప్రాంతాల్లో కాదు.. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వ పోలీసు అధికారి ఇంట్లోనే వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆడ పిల్లలను కిడ్నాప్ చేసి వ్యభిచారంలోకి దింపుతున్నారు. ఓ రాజకీయ పార్టీకి చెందిన మహిళా నేత ఈ వ్యభిచారం నిర్వహించడం విస్తుపోయే విషయం. ఈ వ్యభిచార ముఠాను నడుపుతున్న మహిళా నాయకురాలు బచ్చి దేవిని పాట్నా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గయాలోని ఓ పోలీసు అధికారికి చెందిన ఇంట్లో సెక్స్ రాకెట్‌ నడుస్తోంది. బాలిక కిడ్నాప్ కేసును విచారించగా ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పాట్నాలోని చిట్కోరా ప్రాంతంలో ఓ మైనర్ బాలిక ఇంట్లో పనికి వెళ్తోంది. ఆకస్మాత్తుగా ఆ అమ్మాయి కొద్దిరోజులుగా కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఇంటి యజమానికి ఫోన్ చేసి విచారించగా.. వారం రోజుల నుంచి పనికి రావడం లేదని తెలిసింది.

Read Also:New Payment System: కొత్త పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్లాన్..

బాలిక కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుండగా ఓ నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తనను కొందరు వ్యక్తులు నిర్బంధించారని, ఓ మహిళ తనను బలవంతంగా వ్యభిచారం చేయిస్తోందని బాలిక తెలిపింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. పాట్నా పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. బాలిక చెప్పిన చిరునామా ప్రకారం ఆ అపార్ట్ మెంట్ కు వెళ్లారు. బచ్చి దేవిని శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఫ్లాట్‌లోని సోదాల్లో కొన్ని అభ్యంతరకర వస్తువులు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని ఫుల్వారీ షరీఫ్ ఎస్‌హెచ్‌ఓ రంజిత్ రజాక్ తెలిపారు. అక్కడ బాచి దేవి పేరు, పార్టీ పేరు రాసి ఉన్న నేమ్ ప్లేట్ కూడా దొరికిందని వివరించారు. ఆమె మొబైల్ ఫోన్ సీడీఆర్ ను స్కాన్ చేస్తున్నామని తెలిపారు.

Read Also:Uorfi Javed : రెజ్లర్ల నిరసనపై స్పందించిన ఉర్పీ జావేద్