NTV Telugu Site icon

Project k : లోకనాయకుడికి వెల్కమ్ చెప్పిన ప్రాజెక్ట్ కే టీం..

Whatsapp Image 2023 06 25 At 11.30.08 Am

Whatsapp Image 2023 06 25 At 11.30.08 Am

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన ను చేసారు. ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే నుండి దిశా పటానీ ప్రీ లుక్ కూడా విడుదల అయ్యింది.బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు సాధించిన ప్రభాస్..ఆ తర్వాత సాహో మరియు రాధే శ్యామ్ వంటి వరుస పాన్ ఇండియా మూవీస్ ను చేసాడు. ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోకపోయిన భారీగానే వసూళ్లు తీసుకొచ్చాయి.. ప్రస్తుతం వరుసగా నాలుగు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు.. వాటిలో ఆదిపురుష్ మూవీ ఈ నెల జూన్ 16 న విడుదల అయింది..ఈ సినిమా కూడా ప్రభాస్ కు అంతగా కలిసి రాలేదు అని చెప్పాలి. కానీ విడుదల అయిన నాలుగు రోజులకే 410 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఆదిపురుష్ సినిమా తరువాత కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ మరియు మహానటి సినిమాతో భారీ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె సినిమాలో అలాగే మారుతీ తెరకెక్కిస్తున్న రాజా డీలక్స్ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ మూడు సినిమాలు కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. వీటిలో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా స్పెషల్ అని చెప్పవచ్చు.. ఈ మూవీ ఎవెంజర్స్ తరహాలో ఉండబోతుందని సమాచారం.గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ మూవీ లో ప్రభాస్ కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు అయిన అమితా బచ్చన్ ఈ మూవీ లో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారని సమాచారం.గత కొద్దీ రోజులుగా ఈ మూవీ లో కమల్ హాసన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి..వైరల్ అయిన ఆ వార్తలు నిజం అయినట్లు సమాచారం. ప్రాజెక్ట్ కే సినిమాలో కమల్ హాసన్ భాగం కాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తూ టీజర్ ను కూడా విడుదల చేసారు. ఇప్పటికే మూవీ ఫై భారీ అంచనాలు ఉండగా..ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కే సినిమాలో కమల్ హాసన్ వచ్చి చేరడం తో మరింతగా అంచనాలు పెరిగాయి.

https://twitter.com/tarak9999/status/1671017269181419520?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1671017269181419520%7Ctwgr%5E5594dc7da76c7967df24b2506d84054864f8484e%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

Show comments