NTV Telugu Site icon

Anand Deverakonda: ఆనంద్‌ దేవరకొండ సినిమా చేస్తాడా అనుకున్నా: వంశీ కారుమంచి

Producer Vamsi Karumanchi

Producer Vamsi Karumanchi

Producer Vamsi Karumanchi Speech at Gam Gam Ganesha Pre Release Event: ఆనంద్‌ దేవరకొండ హీరోగా, ఉదయ్‌ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘గం. గం.. గణేశా’. ఈ సినిమాను హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మే 31న రిలీజ్ అవ్వనుంది. ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని చిత్ర బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పినప్పుడు ఆనంద్‌ చేస్తాడా? అనే సందేహం వచ్చిందన్నారు.

‘దర్శకుడు ఉదయ్‌ బొమ్మిశెట్టి కథ చెప్పినప్పుడు ఆనంద్‌ దేవరకొండ సినిమా చేస్తాడా? అనే సందేహం కలిగింది. పాత్ర నచ్చి ఆనంద్‌ ఓకే చేశాడు. ఈ సినిమాలో ఆయనది ఆకతాయిగా, జూలాయిగా తిరిగే పాత్ర. బేబీ సినిమాలోని పాత్రకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. గణేశుని విగ్రహం, డబ్బు చుట్టూ తిరిగే క్రైమ్‌ కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గం. గం.. గణేశా. అందరికీ నచ్చుతుంది. ఆనంద్‌ బాగా చేశాడు. నయన్‌ సారిక, ప్రగతి శ్రీవాస్తవ తమ అందం, అభినయంతో అలరిస్తారు. జబర్దస్త్‌ ఇమ్మాన్యుయేల్‌ బాగా నవ్విస్తాడు. ఈ కథను నెరేషన్‌ కంటే దర్శకుడు బాగా తెరకెక్కించాడు’ అని వంశీ కారుమంచి తెలిపారు.

Also Read: Rashmika Mandanna: రష్మిక ఫేవరెట్‌ హీరో ఎవరో తెలుసా.. మీరు అనుకున్నదే!

‘నాకు చిన్నప్పట్నుంచీ సినిమాలు అంటే పిచ్చి. బాలకృష్ణ గారికి వీరాభిమానిని. మా సొంతూరు గుంటూరు. యూఎస్‌లో తెలుగు సినిమాలన్నీ చూసేవాడ్ని. బాలయ్య బాబు సినిమాలు విడుదలైతే.. థియేటర్లలో పేపర్స్‌ చింపేవాడిని. యూఎస్‌లో ఆర్థికంగా సెటిల్‌ అయ్యాక.. భారత్ వచ్చి సినిమాలు ప్రొడ్యూస్‌ చేయాలనుకున్నా. అయితే లాక్‌డౌన్‌ టైమ్‌లో ఇక్కడికి వచ్చి.. మళ్లీ యూఎస్‌ వెళ్లలేకపోయా. ఆనంద్‌ దేవరకొండతో సినిమా స్టార్ట్‌ చేశా. బాలయ్యతో సినిమా తీసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తా’ అని వంశీ కారుమంచి చెప్పారు.