NTV Telugu Site icon

Kalki 2898 AD 2: ‘కల్కి 2’ అప్‌డేట్‌.. షూటింగ్‌ ప్రారంభమయ్యేది అప్పుడే!

Kalki 2898 Ad

Kalki 2898 Ad

Kalki 2898 AD 2 Shooting Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. గత జూన్‌ 27న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇతిహాసాలతో కూడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన కల్కి.. ఓటీటీలో కూడా దుమ్మురేపుతోంది. రికార్డు వ్యూస్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌ ఉన్న సంగతి తెలిసిందే. సీక్వెల్‌ గురించి ఇప్పటికే చిత్రబృందం పలు సందర్భాల్లో స్పందించింది. నిర్మాతలు తాజాగా మరోసారి కల్కి 2 అప్‌డేట్‌ ఇచ్చారు.

కల్కి నిర్మాతలు స్వప్నదత్‌, ప్రియాంకదత్‌లు రష్యాలో తాజాగా జరిగిన మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ వీక్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘కల్కి 2 షూటింగ్ జనవరి, ఫిబ్రవరిలో మొదలుకానుంది. చిత్రీకరణ ప్రారంభమైన తర్వాత పార్ట్‌ 2కు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ ఇస్తాం’ అని చెప్పారు. ప్రియాంక దత్‌ మాట్లాడుతూ… ‘కల్కి విడుదలైన మొదటి వారంలో ఎంతో మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఎన్నో మెసేజ్‌లు వచ్చాయి. అందరూ స్వచ్ఛందంగా సినిమాను ప్రచారం చేశారు. ఎందరో మాకు మద్దతు ఇచ్చినందుకు చాలా ఆనందం వేసింది. సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ను మేమింకా చేసుకోలేదు’ అని చెప్పారు.

Also Read: Rashmika Mandanna: మునుపెన్నడూ పోషించని పాత్రలో రష్మిక!

కల్కి పార్ట్‌ 2లో తన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని గతంలో కమల్ హసన్‌ చెప్పారు. రెండో భాగం షూటింగ్‌ కొంతమేర చిత్రీకరణ పూర్తయిందని బడా నిర్మాత అశ్వినీదత్‌ తెలిపారు. ‘కల్కి పార్ట్‌ 2 షూటింగ్‌ కొంతమేర చిత్రీకరణ పూర్తయింది. కొన్ని కీలక సన్నివేశాలు, వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తిచేయాల్సి ఉంది. సినిమా మొదటి భాగం చర్చల్లో ఉండగానే రెండు భాగాలు చేయాలన్న ఆలోచన వచ్చింది. ఇందులో కమల్‌ హాసన్‌ భాగమయ్యాక సీక్వెల్‌ కచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నాం’ అని అశ్వినీదత్‌ చెప్పారు. కల్కి 2పై భారీ అంచనాలు ఉన్నాయి.

Show comments