NTV Telugu Site icon

Proba-3 Mission: శ్రీహరికోటలో పీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం

Isro

Isro

Proba-3 Mission: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట సతీష్ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నేడు సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 మిషన్‌ను ప్రయోగిస్తున్నారు. నింగిలోకి 2 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉపగ్రహాలు వెళ్లనున్నాయి. ఒక్కో ప్రోబా-త్రీ ఉపగ్రహం బరువు 550 కేజీలు ఉన్న వాటిని భూ కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నారు. 2 ఉపగ్రహాలు సూర్యునిపై పరిశోధనలు చేయనున్నాయి. ఇందులో ఓకల్టర్ శాటిలైట్ (ఓఎస్సీ), కరోనా గ్రాస్ శాటిలైట్ (సీఎస్సీ ) అనే రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. రాకెట్ సహా మొత్తం 320 టన్నులను నింగిలోకి పంపబోతున్నారు.

Read Also: Kazipet Crime: దారుణం.. వృద్ధుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి..

ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన ద్వారా ప్రయోగించే అవకాశం లభిస్తుందని సైంటిస్టులు అంటున్నారు. ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో టీం ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో అధికారులు రాకెట్‌ నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందారు. ప్రోబా-3 మిషన్‌ ఇండియాది కాదు.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీది. ఈ రాకెట్‌ ప్రయోగం ద్వారా ప్రోబా-3 మిషన్‌లో భాగంగా 550 కేజీల శాటిలైట్లను భూ కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో ఎక్స్ ద్వారా వెల్లడించింది.

 

Show comments