పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించిన విషయం తెలిసిందే. సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈరోజు ఆయనకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఈ కేసు తీర్పుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ లో ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. మూడు విషయాలను ఎక్కువ కాలం దాచలేము.. ‘సూర్యుడు, చంద్రుడు, నిజం’ అంటూ గౌతమ బుద్ధుడి కవితను సంధించారు. అంతేకాకుండా “సత్యమేవ జయతే” అని ట్విట్టర్ లో ప్రియాంక రాసుకొచ్చారు.
Sangareddy Crime: ప్రియురాలి కోసం ఆమె భర్తను హతమార్చిన ప్రియుడు
అటు న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పీఎస్ నరసింహ, సంజయ్ కుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మాట్లాడుతూ.. మాటలు మంచి అభిరుచితో లేవని, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. శిక్ష విధించడానికి ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చెప్పలేదని.. తుది తీర్పు పెండింగ్‌లో ఉన్నందున దోషిగా నిర్ధారించే ఉత్తర్వును నిలిపివేయాలని బెంచ్ పేర్కొందని వారు అన్నారు.