NTV Telugu Site icon

Priyanka Chopra : గ్లోబల్ బ్యూటికి షూటింగ్ లో గాయాలు..

priyanka

priyanka

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస హాలివుడ్ సినిమాలతో పాటుగా బిజీగా ఉంది.. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించింది.. ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాలల్లో నటిస్తుంది..మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. కాగా తాజాగా ప్రియాంక చోప్రాకు గాయాలు తగినట్లు ఉన్నాయి.. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా తెలిపింది..

హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్ళాడి అక్కడే సెటిల్ అయ్యింది. ఎప్పుడైనా ఇక్కడకు వచ్చి వెళ్తుంది.. ప్రియాంక ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా ప్రియాంక నటిస్తున్న హాలీవుడ్ మూవీ బ్లఫ్ చిత్రీకరణలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రియాంకకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. తన గొంతుకు గాయాలైనట్లు ప్రియాంక తన ఇన్ స్టా స్టోరీ ద్వారా వెల్లడించింది.. ఆ ఫోటోలను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది..

ఈ అమ్మడు నటిస్తున్న తాజా హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ చిత్రంలో బాయ్స్ ఫేమ్ కార్ల్ అర్బన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతుంది. రస్సో బ్రదర్స్ బ్యానర్, ఏజీబీఓ స్టూడియోస్ , అమెజాన్ ఎమ్ జీఎమ్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది..