Site icon NTV Telugu

Bhamakalapam 2 : ప్రియమణి ‘భామాకలాపం 2’ ట్రైలర్ వచ్చేసింది..

Whatsapp Image 2024 02 10 At 11.38.44 Pm

Whatsapp Image 2024 02 10 At 11.38.44 Pm

కరోనా సమయంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది.చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు నేరుగా ఓటీటీలో విడుదల అయి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.అలా 2022లో ప్రియమణి నటించినా ‘భామాకలాపం’. నేరుగా ఆహాలో రిలీజై ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ దీనికి కొనసాగింపుగా ‘భామాకలాపం 2’ను తీసుకువస్తున్నారు.దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ‘భామాకలాపం 2’ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ వెబ్ మూవీ ట్రైలర్ ని ఆహా విడుదల చేసింది. ఆహా ఒరిజినల్ గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అంచనాలు పెంచుతుంది.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన హౌస్ వైఫ్ తన ఉనికి చాటుకునేందుకు సొంతంగా ఓ హోటల్ పెట్టాలనుకుంటుంది. అలాంటి ఆమెకు ఓ మాఫీయ వల్ల ఊహించని పరిణామాలు ఎదురవడం, వాటిని ఆమె ఎలా ఎదుర్కొని నిలబడిందనేది ఈ సీక్వెల్ గా ఉండబోతుందనేది ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. సీక్వెల్ మొత్తం బంగారు కోడిపుంజు చూట్టు సాగుతుందని అర్థమవుతుంది. అనుపమ (ప్రియమణి) తాను యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బుతో అనుపమ ఘుమఘుమ అనే హోటల్ పెట్టాలని అనుకుంటున్నానని తన భర్తకు చెబుతున్న సీన్ తో ట్రైలర్ మొదలైంది. అదే సమయంలో ఆమె ఓ కుకింగ్ ఐడల్ షోలో పాల్గొంటుంది. దానికి సెలక్ట్ అవ్వడం.. సంతోషంతో ఈ విషయాన్ని తన భర్తకు చెప్పుకుంటుంది. అయితే ఈ పోటీలో గెలిచిన వారికి బంగారు కోడిపుంజు బహుమతిగా ఉంటుంది. అయితే, దాన్ని దొంగలించేందుకు ఓ మాఫియా గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ మాఫీయ గ్యాంగ్ వల్ల అనుపమకు ఎదురైన పరిణామాలను చూపిస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

Exit mobile version