Priyamani : ఆ స్టార్ హీరో సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్న ప్రియమణి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి ప్రియమణి వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ భామ వరుసగా సినిమాలు అలాగే వెబ్‌సిరీస్‌ల తో పాటు టీవీ షోల్లోనూ నటిస్తూ ఎంతో బిజీ బిజీగా ఉంటోంది.ఈ భామ తాజాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న జవాన్ సినిమా లో కీలక పాత్ర పోషించింది.ఇందులో ప్రియమణి హీరో షారుక్ ఖాన్ కు సహాయం చేసే లక్ష్మి అనే పాత్ర లో నటించి మెప్పించిందీ. గతం లో షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ లోనూ ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ప్రియమణి.జవాన్ సినిమా తో మరొక సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకుందీ ఈ సీనియర్ హీరోయిన్.అయితే ప్రియమణి జవాన్ సినిమా ఇచ్చిన జోష్ తో మరో సూపర్‌స్టార్ సినిమాలో ముఖ్య పాత్ర చేస్తుంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్నటిస్తున్న ‘నేరు’ సినిమాలో ప్రియమణి ముఖ్య పాత్రలో నటిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ప్రియమణి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఇప్పటికే ‘నెరు’ షూటింగ్ ప్రారంభించినట్లు ఇందులో ఆమె పేర్కొంది. ‘నేరు’ చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో మోహన్ లాల్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’, ‘దృశ్యం 2′ చిత్రాలకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. మోహన్‌లాల్, జీతు కాంబినేషన్లో వస్తోన్న ఐదో చిత్రం’ నేరు’. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ లాయర్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం.. అలాగే ప్రియమణి కూడా లాయర్ పాత్రలో నటిస్తుందని సమాచారం.ఈ ఏడాది నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాలో నెగటివ్ రోల్ లో నటించి మెప్పించింది.. ప్రస్తుతం ఈ భామ కొటేషన్ గ్యాంగ్, ఖైమారా, మైదాన్ వంటి సినిమాల్లో నటిస్తోంది.ఇలా ప్రియమణి వరుసగా స్టార్ హీరోల సినిమాలలో విలన్ రోల్స్ అలాగే కథను మలుపు తిప్పే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పిస్తుంది
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?