Site icon NTV Telugu

Priyamani : ఆయన నా ఫేవరేట్ కోస్టార్.. ఆయనతో ఓ యాక్షన్ సినిమా చేయాలని వుంది..

Whatsapp Image 2024 02 15 At 2.18.51 Pm

Whatsapp Image 2024 02 15 At 2.18.51 Pm

టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భామా కలాపం’..2022లో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది.తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా ‘భామా కలాపం 2’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు కూడా అభిమన్యు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ కూడా క్రైమ్, కామెడీ నేపథ్యంలో కొనసాగునున్నట్లు తెలుస్తోంది. ‘భామా కలాపం 2’ సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధం అవుతుంది.ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.‘భామా కలాపం 2’ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రియమణి, మాస్ మహారాజా రవితేజ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆయనతో కలిసి యాక్షన్ సినిమాలో నటించాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టింది.

“చాలా కాలం క్రితం ఇద్దరం కలిసి ‘శంభోశివశంభో‘ సినిమాలో నటించాం.ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కలవలేదు. మళ్లీ ఇన్నాళ్లకు కలిశాం.. రవితేజకు సంబంధించిన అన్ని సినిమాలను చూశాను. మిస్ కాను. అయితే, థియేటర్లలో చూసే అవకాశం అయితే రాలేదు. ఓటీటీలో చూస్తున్నాను. ఆయన నా ఫేవరెట్ కో స్టార్. ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపిస్తున్నారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు.. ఆన్ కెమెరాలో ఎలా ఉంటారో..ఆఫ్ కెమెరాలోనూ అలాగే ఉంటారు. ఇప్పటి వరకు మీరు చాలా యాక్షన్ సినిమాలు చేశారు. నేను కూడా ఇప్పుడిప్పుడే యాక్షన్ సినిమాలు చేస్తున్నాను. మనిద్దరం కలిసి ఎప్పుడు యాక్షన్ సినిమా చేద్దాం..అని రవితేజను అడిగింది.ప్రియమణి ప్రశ్నకు రవితేజ ఆసక్తికర సమాధానం చెప్పారు. “ప్రస్తుతం యాక్షన్ మూవీస్ లో విపరీతమైన కమాండ్ ఉన్న దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని.చాలా మంది ఆయనను మెచ్చుకుంటున్నారు. అతడే మన యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇది మంచి ఐడియా కార్తీక్ ఆలోచించండి” అని రవితేజ అన్నారు.

Exit mobile version