NTV Telugu Site icon

INDvsNZ T20: ఒక్క మ్యాచ్ ఆడకుండానే కప్ అందుకున్నాడు.. పృథ్వీని కూల్ చేశారుగా!

Hardik Pandya Winning Trophy To Prithvi Shaw

Hardik Pandya Winning Trophy To Prithvi Shaw

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో దుమ్మురేపింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో గెలిచి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భారత జట్టు ఏ ట్రోఫీ గెలిచినా అది టీమ్‌లోని ఓ యువ ఆటగాడికి ఇవ్వడం అనే సంప్రదాయాన్ని మరోసారి కొనసాగించింది. తాజాగా ఈ మ్యాచ్‌లో గెలిచి కప్ అందుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఆ ట్రోఫీని యువ ఓపెనర్ పృథ్వీ షాకు అందించాడు. ఈ సిరీస్‌కు అతడు ఎంపికైనా కూడా ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. కానీ కెప్టెన్ హార్దిక్ నేరుగా వచ్చి అతడికి ట్రోఫీ ఇవ్వడంతో అతడు ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాడు. ఆ ట్రోఫీతో ఆనందంగా గెంతులేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

నిజానికి పృథ్వీకి అవకాశం ఇవ్వకుండా ఇషాన్, శుభ్‌మన్ గిల్‌లనే ఓపెనర్లుగా కొనసాగించడంపై హార్దిక్‌ను చాలా మంది విమర్శించారు. ముఖ్యంగా వన్డేల్లో రాణిస్తున్న గిల్ టీ20లకు పనికి రాడని కూడా కొందరు మాజీ క్రికెటర్లు అన్నారు. అయినా వాళ్లపైనే హార్దిక్ నమ్మకముంచాడు. దీని ఫలితం చివరి టీ20లో చూశాం. గిల్ చెలరేగిపోయి టీ20ల్లో తొలి సెంచరీ చేశాడు. కానీ ఇషాన్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భారత్‌.. బౌలింగ్‌లో అదరగొట్టడంతో 168 రన్స్ భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీ20ల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 234/4 రన్స్ చేసింది. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 63 బంతుల్లో 126* రన్స్ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. రాహుల్ త్రిపాఠి (44), హార్దిక్ పాండ్యా (30) రాణించారు. అనంతరం 235 రన్స్ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్‌ 12.1 ఓవర్లలో 66 రన్స్‌ చేసి ఆలౌటైంది. భారత బౌలర్లు దుమ్మురేపడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఓపెనర్‌ ఫిన్ అలెన్‌ (3)ను మొదటి ఓవర్లోనే పెవిలియన్‌కు పంపిన పాండ్యా కివీస్ వికెట్ల ఖాతా తెరిచాడు. అనంతరం రెండో ఓవర్లో కాన్వే (1), చాప్‌మన్‌ (0)ను ఔట్ చేసిన అర్చదీప్ న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఫిలిప్స్ (2), బ్రేస్‌వెల్ (8) శాంట్నర్ (13) కూడా పూర్తిగా విఫలమవడంతో 9ఓవర్లలోనే 53 రన్స్‌కు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డారైల్ మిచెల్ (35) ఒక్కడే పోరాడినా మిగతా బ్యాటర్ల నుంచి మద్దతు కరవవడంతో కివీస్‌ భారీ ఓటమి మూటగట్టుకుంది. ఇండియా బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ 4 వికెట్లతో అదరగొట్టగా.. అర్షదీప్, శివం మావి ఉమ్రాన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Also Read: IN DvsAUS Test: ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్..టీమిండియాను ఓడించడమే లక్ష్యంగా