జగిత్యాల సబ్ జైలులోని ఓ ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశంకు బుధవారం మధ్యాహ్నం గుండె నొప్పి వచ్చింది. సబ్ జైల్ నుండి హుటాహుటిన అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతున్న మల్లేశం ఆసుపత్రిలోనే ఈరోజు కన్నుమూశాడు.
Also Read: Peddapur Gurukul School: పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థికి పాము కాటు!
15 రోజుల క్రింతం రేప్ కేసులో నిందితుడుగా క్యాతం మల్లేశం జగిత్యాల సబ్ జైలుకు వచ్చాడు. మల్లేశం రామన్న పేట మాజీ ఉప సర్పంచ్. తప్పుడు కేసుతో మల్లేశంను జైలుకు పంపించారని కుటుంబ సభ్యులు ముందునుంచి ఆరోపిస్తున్నారు. ఇక మల్లేశంను ఆస్పత్రిలో అడ్మిట్ చేసి.. చనిపోయేంత వరకు తమకు విషయం చెప్పలేదని కుటుంబ సభ్యులు పోలీసులపై మండిపడుతున్నారు. ఈ విషయంలో కోర్టుకు వెళతామని కుటుంబ సభ్యులు అంటున్నారు. కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.