NTV Telugu Site icon

PM Modi: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ.. షెడ్యూల్‌ ఇదే..

Modi

Modi

PM Modi: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.. ఇక, ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాబోతున్నారు.. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు 12వ తేదీన ఉదయం 10:45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకోనున్న ప్రధాని మోడీ.. ఉదయం 10:55 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రాంగణానికి చేరుకుంటారు.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు ప్రధాని… ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి భువనేశ్వర్ బయల్దేరి వెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ..

Read Also: CM Revanth Reddy : ఆగస్టు 15లోగా రుణమాఫీ..!

కాగా, ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు.. వీఐపీలు పెద్ద సంఖ్యలు తరలిరానున్న నేపథ్యంలో.. ప్రముఖుల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తుండడంతో.. పటిష్ట భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ ప్రధాన గేటు నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 65 ఎకరాల్లో ఐదు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ నెల 12న ఉదయం 11.27 నిమిషాలకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు..

Read Also: Ramcharan : బ్రేకింగ్: బాబు ప్రమాణ స్వీకారానికి అతిథిగా రామ్ చరణ్

ఇక, ఈ కార్యక్రమానికి రెండు లక్షల మందికి సరిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం.. వర్షం వచ్చినా తట్టుకునే విధంగా అల్యూనినియం షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేస్తుండగా.. మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజల కోసం గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు.. మరోవైపు భారీ led తెరలు ఏర్పాటు చేస్తున్నారు.. విమానాశ్రయం ప్రధాన గేటు నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గరకు ప్రధాని ఇతర కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం.. ప్రముఖుల భద్రత, వేదిక, వసతుల కల్పన, బారికేడ్ల ఏర్పాటు, పారిశుధ్యం వంటి పనులను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు.. మరోవైపు.. వైద్య శిబిరాలు, మజ్జిగ ప్యాకెట్లు, తాగు నీరు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.. చంద్రబాబు నివాసం ఉండవల్లి దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం జరిగే గన్నవరం వరకు 22 కిలోమీటర్ల పరిధిలో పటిష్ట బందోబస్తు పెట్టనున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న కారణంగా ఇప్పటికే నగరానికి చేరుకున్న ఎస్పీజీ బృందం.. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని బందోబస్తులో మునిగిపోయిన విషయం విదితమే.