Road Accident: ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ మైసూరులోని ఎస్‌జే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటకలోని బందిపురా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మైసూరు సమీపంలో ప్రహ్లాద్ మోడీ కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో ఆయనతో పాటు భార్య, కొడుకు, కోడలు, మనవడు కారులో ఉన్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది.
Hath Se Hath Jodo Yatra: ‘హాత్ సే హాత్ జోడో’ కార్యక్రమానికి పరిశీలకులను నియమించిన ఏఐసీసీ
ప్రహ్లాద్ మోడీ తన కుటుంబ సభ్యులతో మంగళవారం కర్ణాటకలోని బందిపురాకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. మైసూరు శివారులో కడ్కోళ్ల అనే ప్రాంతానికి చేరుకున్న అనంతరం కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోడీకి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు.
