Presidents rule revoked in Jammu and Kashmir: అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో సమైక్య రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన నోటిఫికేషన్‌లో జమ్మూ & కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 (34/2019) సెక్షన్ 73 ద్వారా అందించబడిన అధికారాలను ఉపయోగించడం ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239, 239A జమ్మూ & కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి 31 అక్టోబర్ 2019 నాటి ఉత్తర్వు, జమ్మూ & కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లోని సెక్షన్ 54 ప్రకారం రద్దు చేయబడింది.
World’s 26 Poorest Countries: ప్రపంచంలోని 26 పేద దేశాల అప్పులు 18 ఏళ్ల గరిష్టానికి చేరాయి..
ఇకపోతే ఇటీవల ముగిసిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. కూటమి నేతగా ఆయన ఎన్నికయ్యారు. గతంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత 31 అక్టోబర్ 2019న జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించబడింది. దింతో ఇప్పుడు ఆరేళ్ళ తర్వాత జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు.
President's rule revoked in Jammu and Kashmir, official order paves way for government formation in union territory
— Press Trust of India (@PTI_News) October 13, 2024