Site icon NTV Telugu

Droupadi Murmu: మాల్‌ప్రాక్టీస్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

President Droupadi Murmu

President Droupadi Murmu

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా ఇటీవల మోడీ సర్కార్ లోక్‌సభలో బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లు పార్లమెంట్‌లో పాస్ అయింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేపర్ లీకేజీ బిల్లుకు (Malpractices Bill) ఆమోద ముద్ర వేశారు (President Droupadi Murmu ).

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు ప్రకారం.. ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై పరీక్ష పత్రాలను లీక్ చేసిన వారికి లేదా జవాబు పత్రాలను తారుమారు చేసిన వారికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.కోటి జరిమానా విధించబడుతుంది.

చిత్తశుద్ధితో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఈ బిల్లు లక్ష్యంగా చేసుకోలేదని లోక్‌సభలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అక్రమార్కుల ఆట కట్టించడమే ఈ బిల్లు ఉద్దేశమని పేర్కొన్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ బిల్లు ద్వారా పోలీసులకు సొంతంగా చర్య తీసుకునే అధికారం ఉంటుంది. వారెంట్ లేకుండానే అనుమానుతుల్ని అరెస్ట్ చేయొచ్చు. నిందితుడికి బెయిల్‌కు అర్హత ఉండదు. అలాగే ఆరోపణలు రాజీ ద్వారా పరిష్కరించబడవు. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలు లీకేజీల కారణంగా పోటీ పరీక్షలు వాయిదా పడిన తరుణంలో.. కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

 

Exit mobile version