Site icon NTV Telugu

Nirmal: ఇవాళ స్వగ్రామానికి దుబాయ్ లో హత్యకు గురైన అష్టపు ప్రేమ్ సాగర్ మృత దేహం..

Dead

Dead

బతుకుదెరువు కోసం దుబాయ్ కి వెళ్లిన తెలంగాణ వాసులు ఓ పాకిస్థానీ చేతిలో హత్యకు గురయ్యారు. ఓ బేకరీలో పని చేస్తున్న సమయంలో శ్రీనివాస్, నిర్మల్‌కు చెందిన ప్రేమ్ సాగర్, నిజామాబాద్‌కు చెందిన మరో శ్రీనివాస్ అనే వ్యక్తి చిట్ చాట్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ పాకిస్తానీ వ్యక్తి ఒక్కసారిగా విరుచుకుపడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ధర్మపురి శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ అక్కడికక్కడే మృతి చెందగా, నిజామాబాద్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు.

Also Read:Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

దుబాయ్ లో హత్యకు గురైన అష్టపు ప్రేమ్ సాగర్ మృత దేహం ఇవాళ స్వగ్రామానికి చేరుకోనుంది. మధ్యాహ్నం వరకు ఆయన స్వగ్రామం నిర్మల్ జిల్లా సోన్ కు బంధువులు తీసుకు రానున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు,బంధువులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. ఈనెల 11వ తేదీన దుబాయ్ లో పాకిస్తాన్ కు చెందిన వ్యక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు ప్రేమ్ సాగర్. పాకిస్తానీ దుండగుడు దాడి చేసే సమయంలో ప్రత్యేక నినాదాలు చేస్తున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

Exit mobile version