NTV Telugu Site icon

Pragnancy Ladies : గర్భిణీలు ఫోన్లను వాడితే బిడ్డపై ఎఫెక్ట్ పడుతుందా?

Pragnant Womens

Pragnant Womens

గర్భిణీలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. అందుకే తిండి నుంచి కూర్చొనే, పడుకొనే విధానం వరకు అన్నీ కూడా డాక్టర్ సలహాలను తీసుకుంటారు.. గర్భిణీగా ఉన్నప్పుడు మహిళలు ఫోన్లను వాడటం అంత మంచిది కాదన్న విషయం అందరికి తెలిసిందే.. గర్భధారణ సమయంలో మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పుట్టబోయే బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

గర్భిణీ స్త్రీలు ఎక్కువ కాలం మొబైల్ ఫోన్ రేడియేషన్‌కు గురైనట్లయితే, శిశువు పుట్టిన తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంటుందని ఒక అధ్యయనం కనుగొంది. అంతే కాదు, కడుపు లో పెరుగుతున్న శిశువు మానసిక ఎదుగుదలను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. పిల్లలు చిన్న వయస్సు నుండే చాలా హైపర్ యాక్టివ్ గా మారవచ్చు. వారు ఇతర పిల్లల కంటే ఎక్కువ చికాకు కలిగి ఉంటారు. గర్భం దాల్చిన 2 మరియు 18 వారాల మధ్య ముఖ్యంగా హానికరం అని చెబుతున్నారు.. మొబైల్ ఫోన్లు విద్యుదయస్కాంత వికిరణాన్ని విడుదల చేస్తాయి, ఈ తరంగాలు శరీరం యొక్క DNA ను దెబ్బతీస్తాయి. ఇది భవిష్యత్తులో పిల్లలకు ప్రమాదకరం.

ఎక్కువ సేపు రేడియేషన్‌కు గురైనట్లయితే గర్భిణీ స్త్రీల మెదడు కూడా ప్రభావితమవుతుంది. ఇది నిద్రను ప్రభావితం చేయడం ద్వారా భంగం కలిగించవచ్చు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల అలసట, ఆందోళన వంటి అనేక సమస్యలు వస్తాయి. ఇది జ్ఞాపకశక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. గర్భధారణ సమయం లో సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం, స్క్రోలింగ్‌కు దూరంగా ఉండాలి. ఫోన్‌లో మాట్లాడాలంటే హెడ్‌ఫోన్స్ పెట్టుకోవాలి కాబట్టి ఫోన్‌లోని రేడియేషన్ శరీరానికి దగ్గరగా రాదు. సమయం గడపడానికి మొబైల్ ఫోన్‌ని ఉపయోగించకుండా, ఒక అభిరుచిని తీసుకోండి, పాటలు వినండి లేదా పుస్తకం చదవండి. ఫోన్‌ని ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోకండి… ఏదైనా చూడాలంటే మాత్రం టీవీ లలో చూడటం మంచిది.. అది కూడా ఎక్కువగా చూడకూడదు..