మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చిరు – బాబీ కాంబోలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో చిరు కూతురుగా ఎవరు నటిస్తారనేదానిపై కొద్దీ రోజలుగా రోజుకొక పేరు వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం ఇప్పటి వరకు ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి పేరు ప్రముఖంగా వినిపించింది. కాని ఇటీవల కొద్ది రోజులగా ‘మలయాళ భామ’ అనశ్వర రాజన్ ఫిక్స్ అయిందని వార్తలు వెలువడ్డాయి. రోషన్ మేక హీరోగా వచ్చిన ఛాంపియన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనశ్వర రెండవ సినిమాతోనే ఏకంగా మెగా స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టిసిందని అంతా అనుకున్నారు.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం చిరు – బాబీ సినిమాలో కృతి కాదు, అనశ్వర అంతకన్నా కాదు ప్రీతి ముకుందన్ ఫిక్స్ అయింది. ఈ చిత్రంలో ఆమె మెగాస్టార్ కూతురిగా కీలక పాత్రలో నటించనుంది. పలువురి పేర్లు వినిపించినప్పటికీ అంతిమంగా ఆ లక్కీ ఛాన్స్ ప్రీతి ముకుందన్నే వరించింది. ఈ మెగా ప్రాజెక్ట్ ఆమె కెరీర్‌కు పెద్ద బూస్ట్ ఇస్తుందనడంలో సందేహం లేదు. మెగాస్టార్ సినిమాతో పాటు, మరో క్రేజీ ప్రాజెక్టులోనూ ప్రీతి భాగమైంది. శైలేష్ కొలను దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రంలో రోషన్ మేక సరసన కథానాయికగా ఆమెను ఎంపిక చేశారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌లో ఆమె లుక్ చాలా ఫ్రెష్‌గా, స్ట్రైకింగ్‌గా ఉండి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వరుసగా రెండు పెద్ద సినిమాలు, అగ్ర దర్శకులు మరియు ప్రముఖ నిర్మాణ సంస్థలతో పని చేసే అవకాశం రావడంతో ప్రీతి ముకుందన్ ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.