Site icon NTV Telugu

Health Tips: వర్షాకాలం వ్యాధుల కాలం.. ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే.. ప్రమాదంలో పడ్డట్టే!

Health

Health

వర్షా కాలం కొనసాగుతోంది. ఎడతెరిపి లేని వానల వల్ల పరిసరాలు మొత్తం బురద మయంగా మారుతుంది. చెత్తా చెదారం పేరుకుపోయి దోమల వ్యాప్తికి కారణం అవుతుంది. వర్షాకాలం వ్యాధుల కాలం అన్నట్లు వైరల్ ఫీవర్స్ వెంటాడుతుంటాయి. ఆసుపత్రులకు రోగులు క్యూకడుతుంటారు. దోమలు వచ్చాయి అంటే కచ్చితంగా వాటి వెనుక వ్యాధులు కూడా వస్తాయి. వర్షాకాలంలో ముఖ్యంగా వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, జలుబు, దగ్గు వంటి వ్యాధులు సోకుతాయి. ఈ వ్యాధుల భారిన పడ్డప్పుడు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం వస్తూ ఉంటుంది.

Also Read:Honeymoon Murder Case: సోనమ్ రఘువంశీ కుటుంబం కీలక నిర్ణయం.. బాధిత కుటుంబానికి ఏం చేసిందంటే..!

జ్వరంతో పాటుగా చలి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరానికి తోడు కొందరిలో తీవ్రమైన తలనొప్పి, వాంతులు కూడా అవుతూ ఉంటాయి. చాలా త్వరగా నీరసం అయిపోతారు. అస్సలు ఓపిక ఉండదు. తినడానికి కూడా ఇష్టపడరు. వచ్చిన జ్వరం అప్పుడే తగ్గి మరికాసేపటికే పెరుగుతూ ఉంటుంది. ఇవి వైరల్ ఫీవర్, డెంగ్యూ, టైఫాయిడ్ లక్షణాలు.. ఇవి పిల్లలు, పెద్దలు ఎవరిలో కనపడినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Also Read:Smart Phones: ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లపై వేలల్లో డిస్కౌంట్.. ఇప్పుడు కొంటే లాభం!

వైరల్ ఫీవర్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరిలో లక్షణాలు కనిపించినా మిగిలిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడిగా ఉండే ఆహారపదార్థాలు, కాచి చల్లార్చిన నీటిని తాగాలి. అనారోగ్యానికి గురైనప్పుడు సొంత వైద్యం కాకుండా డాక్టర్ ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version