మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను భారత్ గెలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి మెగా టోర్నీని సాధించింది. భారత్ సెమీస్ చేరడంలో ఓపెనర్ ప్రతీక రావల్ కీలక పాత్ర పోషించింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన న్యూజిలాండ్ మ్యాచ్‌లో ప్రతీక సెంచరీ (122) బాదింది. న్యూజిలాండ్‌పై విజయంతో భారత్ నాకౌట్‌కు అర్హత సాధించింది. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచులో గాయపడి.. టోర్నీ నుంచి తప్పుకుంది.
గాయం కారణంగా సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు ప్రతీక రావల్ ఆడలేదు. లీగ్ దశలో 7 మ్యాచ్‌లూ ఆడిన ఆమె 51.33 సగటుతో 308 పరుగులు రన్స్చేసింది. ఇందులో ఓ సెంచరీ, ఓ అర్ధ శతకం ఉన్నాయి. ఇక ప్రతీక స్థానంలో బేబీ సెహ్వాగ్ షఫాలీ వర్మకు చోటు దక్కింది. సెమీఫైనల్స్‌లో విఫలమైన షెఫాలీ.. ఫైనల్స్‌లో మాత్రం సత్తాచాటింది. బ్యాటింగ్‌లో 87 పరుగులు.. బౌలింగ్‌లో రెండు కీలక వికెట్స్ పడగొట్టింది. భారత్ ప్రపంచకప్ గెలిచిన అనంతరం సహచరులు వీల్‌చైర్‌లో ఉన్న ప్రతీకను వేదిక మీదకు తీసుకొచ్చి.. జట్టు సంబరాల్లో భాగం చేశారు.
Also Read: Anushka Sharma: ఇదే మంచి సమయం.. అనుష్క శర్మ సినిమా రిలీజ్ చేయండి!
ఇదంతా బాగానే ఉన్నా.. వన్డే ప్రపంచకప్ 2025 ‘విన్నర్ మెడల్’ మాత్రం ప్రతీక రావల్‌కు దక్కలేదు. మెగా టోర్నీని చిరస్మరణీయంగా మార్చే పథకం దక్కడపోవడం దురదృష్టమనే చెప్పాలి. అయితే మెడల్ దక్కపోవడానికి కారణం లేకపోలదు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. 15 మందికే విన్నర్ మెడల్ ఇస్తారు. ప్రతీకను అధికారికంగా జట్టు నుంచి తప్పించిన తర్వాతే.. షఫాలీ వర్మని జట్టులోకి తీసుకున్నారు. ప్రతీక జట్టులో సభ్యురాలు కాదు కాబట్టి.. మెడల్ దక్కలేదు. రెండు మ్యాచ్‌లు ఆడిన షఫాలీకి మెడల్ రావడం లక్కీ అనే చెప్పాలి. దేశవాళీ క్రికెట్ ఆడుతున్న షఫాలీకి ప్రతీక గాయం రూపంలో కలిసొచ్చింది.
